Aadujeevitham: ‘ఇదొక అద్భుతమైన చిత్రం.. ప్రేక్షకులు తప్పక సపోర్ట్‌ చేయాలి’ - కమల్‌ హాసన్‌

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’(Aadujeevitham)పై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్‌ (Kamal Haasan) ప్రశంసల వర్షం కురిపించారు.

Published : 27 Mar 2024 14:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో బ్లెస్సీ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆడు జీవితం’ (Aadujeevitham). మార్చి 28న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. సర్వైవల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తాజాగా అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ (kamal haasan), ప్రముఖ దర్శకుడు మణిరత్నం (maniratnam) వీక్షించారు. టీమ్‌ను మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

‘‘బ్లెస్సీకి నా ధన్యవాదాలు. ఒక వ్యక్తి కథను ఈవిధంగా తెరపైకి తీసుకురావడం అంత సులభం కాదు. దర్శకుడి హార్డ్‌వర్క్‌కు ఇది నిదర్శనం. విభిన్న చిత్రాలు తెరకెక్కించాలనే తపన తెలుస్తోంది. సినిమా చూసి మణిరత్నం ఎంతో ఆశ్చర్యపోయారు. విరామ సమయంలో ప్రేక్షకులకూ మంచినీళ్లు తాగాలనే భావన కలుగుతుంది. పృథ్వీరాజ్ అద్భుతంగా నటించారు. కెమెరామెన్‌ పనితనాన్ని తప్పకుండా మెచ్చుకోవాలి. ఫిల్మ్‌మేకర్స్‌గా మేము దీనిని అర్థం చేసుకున్నాం. ప్రేక్షకులు కూడా దీనిని అర్థం చేసుకోని సపోర్ట్‌ చేయాలని కోరుతున్నా’’ అని కమల్‌హాసన్‌ అన్నారు. సినిమా అద్భుతంగా ఉందంటూ మణిరత్నం మెచ్చుకున్నారు. దీనిపై పృథ్వీరాజ్‌ స్పందించారు. ‘‘ఆడు జీవితం’కు దక్కిన పెద్ద అవార్డు ఇది’’ అని పోస్ట్‌ పెట్టారు. పృథ్వీరాజ్‌ యాక్టింగ్‌కు బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్ సైతం ఫిదా అయ్యారు. స్పెషల్‌ షో చూడాలనుకుంటున్నట్లు చెప్పారు.

90వ దశకంలో జీవనోపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వలసవెళ్లిన నజీబ్‌ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా ‘ఆడు జీవితం’ తెరకెక్కించారు. 16 ఏళ్ల క్రితమే ఈ సినిమాతో తన ప్రయాణం మొదలైందని పృథ్వీరాజ్‌ తెలిపారు. నజీబ్‌ పాత్ర కోసం ఆయన 31 కిలోల బరువు తగ్గారు. ఆయనకు జోడీగా నటి అమలాపాల్‌ నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని