Kanchana 4: ‘కాంచన 4’ వచ్చేస్తోంది.. రిలీజ్‌ అప్పుడేనా!

రాఘవా లారెన్స్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంచన’. విడుదలైన మూడు భాగాలు సూపర్ హిట్ కావడంతో నాలుగో పార్ట్‌ను ప్రకటించారు. 

Published : 06 Jun 2024 12:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాఘవ లారెన్స్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంచన’. హారర్‌ కామెడీ జానర్‌లో ట్రెండ్‌ని సెట్‌ చేసిన ఈ సినిమా ఇప్పటికే మూడు భాగాలుగా వచ్చి భారీ హిట్‌ను అందుకుంది. ఇప్పుడీ చిత్రానికి నాలుగో పార్ట్‌ను ప్రకటించారు. ‘కాంచన 4’ (Kanchana 4) పేరుతో ఇది రానుంది. సెప్టెంబర్‌లో దీని షూటింగ్‌ ప్రారంభించనున్నారు. దీనికి కూడా లారెన్స్‌ (raghava lawrence) దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా దీన్ని విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 

లారెన్స్‌ దర్శకత్వంలో 2011లో విడుదలైన ‘కాంచన’ విజయాన్ని సాధించింది. దీంతో 2015లో రెండో పార్ట్‌ను విడుదల చేయగా అది కూడా మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. 2019లో ‘కాంచన-3’ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో నాలుగో భాగం కోసం సినీ ప్రియులు ఎదురుచూశారు. తాజాగా దీన్ని ప్రకటించడంతో వారంతా సంబర పడుతున్నారు. మూడు భాగాల్లో లారెన్స్‌ ప్రధానపాత్రలో నటించగా కోవై సరళ, శరత్‌కుమార్ కీలకపాత్రల్లో నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని