Kangana Ranaut: నేను రాజకీయాల్లోకి రావాలంటే ఇదే సరైన సమయం: కంగనా రనౌత్‌

తాను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇదే సరైన సమయమని నటి కంగనా రనౌత్‌ అభిప్రాయపడ్డారు.

Published : 27 Feb 2024 17:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ (Kangana Ranaut) రాజకీయాల్లోకి రానున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆమె స్పందించారు. తనకు రాజకీయ నేపథ్యం లేకపోవడమనేది దేశానికి సేవ చేసేందుకు అడ్డంకి కాదన్నారు.

ఓ కార్యక్రమంలో కంగనా మాట్లాడుతూ.. ‘నేను దేశం కోసం ఎంతో చేశాను. సినిమా సెట్‌ నుంచే రాజకీయ పార్టీలతో పోరాడాను. జాతీయవాదిగా గుర్తింపు తెచ్చుకున్నాను. రెండు దశాబ్దాల నుంచి నటిగా వచ్చిన గుర్తింపు కంటే జాతీయవాదిగానే అందరికి తెలిసింది. ఒకవేళ నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఇదే సరైన సమయం. ఈ దేశంలోని అన్ని ప్రాంతాలతో నాకు మంచి అనుబంధం ఉంది. నార్త్‌ నుంచి వచ్చి సౌత్‌లో ఎక్కువ సినిమాలు చేశాను.  ఝాన్సీరాణి వంటి శక్తిమంతమైన పాత్రలనూ చేశా. ప్రజలు నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. దేశం నాకు చాలా ఇచ్చింది. తిరిగి ఇవ్వడం నా బాధ్యత. నన్ను ప్రశంసిస్తూ అభిమానించేవారికి రుణపడి ఉంటాను’ అని చెప్పారు.

అందరి చూపు.. ఈ సిరీస్‌ల సీక్వెల్స్‌ వైపు.. మీరు దేనికోసం ఎదురుచూస్తున్నారు?

కంగనా వివిధ సందర్భాల్లో భాజపా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రధాని నరేంద్రమోదీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే కంగన రనౌత్‌ భాజపాలో చేరితే స్వాగతిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గతంలోనే పేర్కొన్న సంగతి తెలిసిందే. సినిమాల విషయానికొస్తే.. ఆమె కీలక పాత్రలో నటించిన ‘ఎమర్జెన్సీ’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో కనిపిస్తున్నారు. దీనితో పాటు ‘తను వెడ్స్‌ మను పార్ట్‌ 3’ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని