Kannappa Teaser: ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది.. కన్నప్ప టీజర్‌ అప్‌డేట్‌ ఇచ్చిన మంచు విష్ణు

Kannappa Teaser: ఇటీవల కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని, ఇప్పుడు ఆ టీజర్‌ను మీ ముందుకు తీసుకురాబోతున్నామని మంచు విష్ణు తెలిపారు.

Updated : 07 Jun 2024 16:03 IST

హైదరాబాద్‌: అత్యంత భారీ నిర్మాణవ్యయం, అత్యాధునిక సాంకేతికతో రూపొందుతున్న ఫాంటసీ డ్రామా ‘కన్నప్ప’. మంచు విష్ణు (Vishnu Manchu) టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ వచ్చేసింది. ఈ మూవీ టీజర్‌ను (Kannappa Teaser) విడుదల చేయనున్నట్లు కథానాయకుడు విష్ణు తెలిపారు. ఎక్స్‌ వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్ట్‌ పెట్టారు. ‘కేన్స్‌లో అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఎంతో థ్రిల్‌గా అనిపిస్తోంది. పురాణగాథ ‘కన్నప్ప’ మూవీ టీజర్‌ను జూన్‌ 14న మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ చిత్రానికి నా గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఇక కన్నప్ప ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానించకుండా ఉండలేను’ అని పేర్కొన్నారు.

పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్నారు. మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. ఇటీవల జరిగిన షెడ్యూల్‌లో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌కుమార్‌ పాల్గొన్నారు. అక్షయ్‌ ఈ చిత్రంలో శివుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. నందీశ్వరుడి పాత్రను ప్రభాస్‌ పోషించనున్నట్లు ప్రచారం సాగుతోంది. వీరితో పాటు మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌, ఆర్‌.శరత్‌కుమార్‌, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టీఫెన్‌ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘కన్నప్ప’ చిత్రం అత్యధిక భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించారు. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని