kannappa: కేన్స్‌లో ‘కన్నప్ప’ టీజర్‌.. రెస్పాన్స్‌పై విష్ణు పోస్ట్‌..

మంచు విష్ణు కలల ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప’ టీజర్‌ను కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. దానికి మంచి స్పందన వచ్చినట్లు తెలిపారు. 

Updated : 21 May 2024 16:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఫాంటసీ డ్రామా ‘కన్నప్ప’. ముకేశ్‌ కుమార్‌సింగ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర టీజర్‌ను కేన్స్‌లో ప్రదర్శించారు. దీనిపై ఎంతో ఆనందంగా ఉందని ఆయన (Manchu Vishnu) పేర్కొన్నారు. 

‘కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో (Cannes Film Festival) ఈ చిత్ర టీజర్‌ను ప్రదర్శించాం. అద్భుతమైన  రెస్పాన్స్‌ వచ్చింది. అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్‌లు దీనిపై ఆసక్తిగా ఉన్నారు. ఇంత గొప్ప రెస్పాన్స్‌ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. భారత్‌లో ఉన్న ఆడియన్స్‌ కోసం ఈ టీజర్‌ను జూన్‌ 13న విడుదల చేయనున్నాం. దీనికంటే ముందు మే 30న ‘కన్నప్ప’ను (Kannappa) మొదటినుంచి సపోర్ట్‌ చేస్తున్న వారికోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్‌ వేయనున్నాం. హైదరాబాద్‌లోని థియేటర్లో దీన్ని ప్రదర్శించనున్నాం. ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభమైనప్పటినుంచి సోషల్ మీడియాలో నిరంతరం మెసేజ్‌లు చేస్తూ.. ప్రోత్సహిస్తున్న వారిని త్వరలోనే మా టీమ్‌ సంప్రదిస్తుంది’ అని తెలిపారు. ప్రేక్షకులందరినీ ‘కన్నప్ప’ ప్రపంచంలోకి తీసుకెళ్లడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. కేన్స్‌ (Cannes 2024) చిత్రోత్సవంలో దిగిన ఫొటోలను పంచుకున్నారు.

‘ఫ్యామిలీస్టార్‌’కు నెగెటివ్ టాక్‌ ఇలా క్రియేట్‌ చేశారు: ఆనంద్‌ దేవరకొండ

పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం (Kannappa Movie) షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే అక్షయ్‌కుమార్‌ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. వివిధ భాషలకు చెందిన అగ్ర నటులు మోహన్‌బాబు (Mohan Babu), మోహన్‌లాల్‌, శివ రాజ్‌కుమార్‌, శరత్‌కుమార్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని