Anand Deverakonda: ‘ఫ్యామిలీస్టార్‌’కు నెగెటివ్ టాక్‌ ఇలా క్రియేట్‌ చేశారు: ఆనంద్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీస్టార్‌’పై వచ్చిన నెగెటివ్‌ కామెంట్స్‌ గురించి ఆనంద్‌ దేవరకొండ స్పందించారు.

Published : 21 May 2024 10:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీస్టార్‌’కు కావాలనే నెగెటివ్‌ టాక్‌ క్రియేట్‌ చేశారని ఆనంద్‌ దేవరకొండ అన్నారు. ‘గం గం గణేశా’ ట్రైలర్‌ విడుదల వేడుకలో దీనిపై ఆయన స్పందించారు. ‘ఫ్యామిలీస్టార్‌’ దుష్ప్రచారంపై సైబర్‌క్రైమ్‌కు ఇచ్చిన కంప్లైంట్‌ గురించి మాట్లాడారు.

‘ఆ సినిమా రిలీజ్‌ కావడానికి 48 గంటల ముందు నుంచే విజయ్‌ దేవరకొండ పాత చిత్రాల నెగెటివ్‌ టాక్‌ వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. ‘ఫ్యామిలీస్టార్‌’ రిజల్ట్‌ అంటూ థంబ్‌ నెయిల్స్‌ పెట్టారు. దీంతో ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యారు. సినిమా చూసిన తర్వాత ఫలితం గురించి ఎవరైనా మాట్లాడొచ్చు. కానీ, రిలీజ్‌ కూడా కాకముందే దాని టార్గెట్‌ చేసి ఎటాక్‌ ఎందుకు చేస్తున్నారు? అలాంటి వాళ్లు మన ఇండస్ట్రీకే ప్రమాదకరం. ఇది సరైన పద్ధతి కాదు. ఇలా ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనేది తెలియడం కోసం సైబర్‌క్రైమ్‌కు కంప్లైంట్‌ ఇచ్చాం. ఇవ్వన్నీ పక్కన పెడితే విజయ్‌ దేవరకొండ నుంచి ఇకపై మంచి సినిమాలు వస్తాయి. ఇటీవలే మూడు సినిమాలు ప్రకటించారు. అవి కచ్చితంగా మీకు నచ్చుతాయని ఆశిస్తున్నా’ అని చెప్పారు.

విజయ్‌ దేవరకొండ- సుకుమార్‌ కాంబో.. అప్‌డేట్‌ ఇచ్చిన నిర్మాత

విజయ్‌ దేవరకొండ -  మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన  ‘ఫ్యామిలీస్టార్‌’ (The Family Star)ఈ ఏడాది ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనిపై ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో నెగిటివ్‌ కామెంట్స్‌ చేశారని విజయ్‌ టీమ్‌ తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టుల ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు  ఫిర్యాదు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని