kantara chapter 1: ‘కాంతార 1’ కోసం ఆ హాలీవుడ్‌ బృందం

చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ ముందు భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘కాంతార’. రిషబ్‌శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన ఈ సినిమాకి ఇప్పుడు ప్రీక్వెల్‌ సిద్ధమవుతోంది.

Published : 12 Jun 2024 01:41 IST

చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ ముందు భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘కాంతార’. రిషబ్‌శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన ఈ సినిమాకి ఇప్పుడు ప్రీక్వెల్‌ సిద్ధమవుతోంది. ‘కాంతార: చాప్టర్‌ 1’ పేరుతో సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తోంది. భారీ గ్రాఫిక్స్‌ హంగులతో ముస్తాబు కానున్న ఈ సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపినట్లు సమాచారం. ‘ది క్రానికల్స్‌ ఆఫ్‌ నార్నియా’, ‘ది లయన్‌ కింగ్‌’, ‘బాట్‌మ్యాన్‌’ లాంటి విజయవంతమైన హాలీవుడ్‌ సినిమాలకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్‌ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు యూఎస్, యూకేల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం కుందాపుర తీర ప్రాంతంలో నిర్మించిన భారీ సెట్‌లో శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటున్నట్లు తెలిసింది. ఈ పాత్ర కోసం రిషబ్‌ ఇప్పటికే కళరిపయట్టు, గుర్రపు స్వారీలో కఠిన శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్, ఛాయాగ్రహణం: అరవింద్‌ కశ్యప్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు