Kartikeya: అవును.. ఇది ప్రభాస్‌ కారే: అభిమానికి కార్తికేయ రిప్లై

తాను వినియోగిస్తున్న కారు గురించి హీరో కార్తికేయ ఓ ఆసక్తికర విషయం పంచుకున్నారు. 

Published : 28 May 2024 17:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన కొత్త సినిమా ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam) ప్రమోషన్స్‌తో ఫుల్‌ బిజీగా ఉన్నారు హీరో కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda). టైటిల్‌కు తగ్గట్టే ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో.. కారులో ప్రయాణిస్తూ ఆయన ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్పింగ్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. జాగ్వార్‌ కారును తానే స్వయంగా డ్రైవ్‌ చేస్తూ హోస్ట్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానాలివ్వడం అందరినీ ఆకర్షిస్తోంది. సినిమా సంగతులతోపాటు ఆ కారు గురించి ఓ ఆసక్తికర విషయం పంచుకున్నారు కార్తికేయ. ‘ఈ కారు ఒకప్పుడు ప్రభాస్‌ది. ఇప్పుడు ప్రభాస్‌ (Prabhas) ఎక్స్‌ (మాజీ) కారు అయింది’ అంటూ నవ్వులు పూయించారు. సంబంధిత విజువల్స్‌ని ప్రభాస్‌ ఫ్యాన్‌ ఒకరు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ‘ప్రభాస్‌ సర్‌ ఎక్స్‌ కారు ఇది’ అని పేర్కొన్నాడు. దానిపై కార్తికేయ స్పందిస్తూ.. అవునని రిప్లై ఇచ్చారు. నవ్వుల ఎమోజీలు జోడించారు.

‘‘బుజ్జి’ని కూడా డ్రైవ్‌ చేయండి’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రంలో బుజ్జి అనే అధునాతన వాహనం కీలకమనే సంగతి తెలిసిందే. ‘భజే వాయు వేగం’ విషయానికొస్తే.. వాణిజ్య అంశాలతో నూతన దర్శకుడు ప్రశాంత్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రమిది. గతంలో ఈయన.. దర్శకుడు సుజీత్‌ వద్ద ‘రన్‌ రాజా రన్‌’, ‘సాహో’ చిత్రాలకు పనిచేశారు. ఐశ్వర్య మేనన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ఈనెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని