Siren: ఓటీటీలోకి వచ్చేస్తోన్న కీర్తి సురేశ్‌ ఎమోషనల్‌ డ్రామా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే

కీర్తి సురేశ్‌ నటించిన ‘సైరన్‌’ ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది.

Updated : 10 Apr 2024 10:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జయం రవి, కీర్తి సురేశ్‌ కీలక పాత్రల్లో నటించిన యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎమోషనల్‌ డ్రామా ‘సైరెన్‌’ (Siren). 108.. అనేది ఉపశీర్షిక. ఆంటోని భాగ్యరాజ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. తొలుత దీన్ని తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లో విడుదల చేయాలని భావించారు. కానీ, ఫిబ్రవరి 19న తమిళంలో మాత్రమే థియేటర్‌లో రిలీజ్‌ చేశారు. అక్కడ పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రానుంది. ఏప్రిల్‌ 19 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ప్రసారం కానుంది. ఐదు భాషల్లో ఇది అందుబాటులో ఉండనున్నట్లు ఓటీటీ సంస్థ తెలిపింది.

కథేంటంటే..

తన భార్య జెన్నీఫర్‌ (అనుపమపరమేశ్వరన్‌)ను మర్డర్‌ చేసిన కేసులో తిలగన్‌(జయం రవి)కు శిక్ష పడుతుంది. అప్పటికే వారికి ఓ కూతురు ఉంటుంది. ఖైదీ కూతురు అంటూ బాల్యంలో అందరూ ఆమెను హేళన చేస్తారు. దీంతో ఆమె తండ్రిని ద్వేషించడం మొదలుపెడుతుంది. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన ఇద్దరు పొలిటికల్‌ లీడర్స్‌తో పాటు పోలీస్‌ ఆఫీసర్‌ను చంపేస్తాడు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను నందిని (కీర్తి సురేష్‌) తీసుకుంటుంది. అసలు తిలగన్ నిజంగానే తన భార్యను హత్య చేశాడా? నందిని దర్యాప్తులో ఏం తేలింది? అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేసే ఆయనకు పొలిటికల్‌ లీడర్స్‌తో పరిచయం ఎలా ఏర్పడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని