Kiara Advani: సిద్ధార్థ్‌ ప్రపోజల్‌.. ఆ క్షణం ఎప్పటికీ మర్చిపోను: కియారా అడ్వాణీ

కరణ్‌ జోహర్‌ (Karan Johar) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్‌ కరణ్‌’ (Koffee With Karan) కార్యక్రమంలో తాజాగా కియారా అడ్వాణీ (Kiara Advani), విక్కీ కౌశల్‌ సందడి చేశారు. తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

Updated : 07 Dec 2023 15:59 IST

ముంబయి: తన భర్త సిద్ధార్థ్‌ మల్హోత్ర (Sidharth Malhotra) లవ్‌ ప్రపోజ్‌ చేసిన క్షణాలను తాను ఎప్పటికీ మర్చిపోనని నటి కియారా అడ్వాణీ (Kiara Advani) అన్నారు. ‘షేర్షా’లోని డైలాగ్‌ చెప్పి ప్రేమను వ్యక్తపరిచాడంటూ ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో ఆమె తెలిపారు. ‘‘షేర్షా’ సినిమా తర్వాత మేమిద్దరం స్నేహితులమయ్యాం. అలా, సిద్ధార్థ్‌, అతని కుటుంబసభ్యులతో కలిసి రోమ్‌ టూర్‌కు వెళ్లా. అతడు నాకు ప్రపోజ్‌ చేస్తాడని అప్పుడే నాకు అర్థమైంది. ‘‘నువ్వు నాకు ప్రపోజ్‌ చేయాలనుకుంటే ముందు నా తల్లిదండ్రుల పర్మిషన్‌ తీసుకోవాలి’’ అని చెప్పా. తర్వాత నేనూ - సిద్ధార్థ్‌, వాళ్ల బంధువు ఒకరు డిన్నర్‌ డేట్‌కు వెళ్లాం. క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ అనంతరం నాకు బాగా బడలికగా అనిపించింది. వాకింగ్‌కు వెళ్దామని సిద్ధార్థ్‌ అడగడంతో ఓకే అన్నా.

Vijay: మిగ్‌జాం తుపాను.. అభిమానులంతా సాయం చేయాలని పిలుపునిచ్చిన విజయ్‌

మేమిద్దరం కాస్త దూరం వెళ్లగానే చుట్టుపక్కల ఉన్న పొదల్లోంచి ఒక్క వ్యక్తి వయోలిన్‌తో మా వద్దకు వచ్చి ప్లే చేస్తూ ఉన్నాడు. వెంటనే, సిద్ధార్థ్‌ మోకాళ్లపై కూర్చొని ‘షేర్షా’లోని.. ‘‘దిల్లీ కా సీదా సాదా లుండా హు’’ (దిల్లీ నుంచి వచ్చిన ఓ సాదాసీదా అబ్బాయిని నేను) అంటూ డైలాగ్‌ చెప్పి తన ప్రేమను వ్యక్తపరిచాడు. అతను డైలాగ్‌ చెబుతుంటే బాగా నవ్వేశా. అతని ప్రేమకు అంగీకారం తెలిపా. మా జీవితాల్లో ఎంతో విలువైన ఈ క్షణాలను సిద్ధార్థ్‌ బంధువు వీడియో తీశాడు’’ అంటూ కియారా ఆ క్షణాలు గుర్తు చేసుకున్నారు.. ఈ ఏడాది ఫిబ్రవరి 7న కియారా - సిద్ధార్థ్‌ వివాహం జరిగింది. జైసల్మేర్‌ (రాజస్థాన్‌)లోని సూర్యగఢ్‌ ప్యాలస్‌లో జరిగిన పెళ్లిలో కుటుంబసభ్యులు, బాలీవుడ్‌ సెలబ్రిటీలు సందడి చేశారు.  ఇదే కార్యక్రమంలో పాల్గొన్న విక్కీ కౌశల్‌ తన లవ్‌ ప్రపోజల్‌ను చెప్పిన అంశాన్ని వెల్లడించారు. పెళ్లికి ఒక్కరోజు ముందే తాను కత్రినకు ప్రపోజ్‌ చేశానన్నారు. కత్రిన రాకతో తన జీవితం ఎంతో మారిందన్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని