Vijay: మిగ్‌జాం తుపాను.. అభిమానులంతా సాయం చేయాలని పిలుపునిచ్చిన విజయ్‌

మిగ్‌జాం తుపాను బాధితులకు సాయం చేయాలని నటుడు విజయ్‌ (Vijay) సోషల్‌ మీడియాలో పిలుపునిచ్చారు. అందరూ సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు.

Updated : 07 Dec 2023 12:42 IST

చెన్నై: మిగ్‌జాం తుపాను దెబ్బకు చెన్నై మహా నగరం మొత్తం అతలాకుతలమైంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇక ఈ తుపాను ప్రభావాన్ని తెలిపే వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు బాధితులకు సాయం చేసేందుకు ప్రముఖులు ముందుకొస్తున్నారు. కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) తాజాగా దీనిపై పోస్ట్‌ పెట్టారు. తన అభిమానులందరూ స్వచ్ఛందంగా వచ్చి బాధితులను ఆదుకోవాలని కోరారు.

సందీప్‌ వంగాను అలా అనుకోవడం అమాయకత్వం..: హరీశ్‌ శంకర్‌

‘మిగ్‌జాం తుపాను కారణంగా ఎంతో మంది పిల్లలు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులకు గురవుతున్నారు. తాగునీరు, ఆహారం వంటి కనీస వసతులు లేక వేలాది మంది నానాఅవస్థలు పడుతున్నారు. వరదల్లో ఎంతోమంది చిక్కుకున్నారు. తమను రక్షించాలని కోరుతూ సోషల్‌మీడియాలో ఇంకా వారి ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో బాధిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల్లో నా అభిమానులంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరుతున్నా’ అని విజయ్‌ పోస్టు చేశారు.

ఇక తుపాను బాధితులకు ఇప్పటికే పలువురు సెలబ్రిట్రీలు సాయం చేశారు. బాధిత ప్రాంతాల్లో ఆహార పంపిణీ కోసం సూర్య(Suriya), కార్తీలు రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే యంగ్‌ హీరో హరీశ్ కల్యాణ్ కూడా తనవంతుగా రూ.లక్ష సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. అందరూ ముందుకు వచ్చి బాధితులను ఆదుకోవాలని ఆయన కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని