Kona Venkat: ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’.. వారికి కోన వెంకట్‌ రిప్లై

అంజలి కీలక పాత్రలో నటించిన హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’.

Updated : 13 Apr 2024 12:10 IST

హైదరాబాద్‌: ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ చిత్రానికి పలువురు సినీ విశ్లేషకుల నుంచి వచ్చిన మిశ్రమ స్పందనపై కోన వెంకట్‌ స్పందించారు. తమ చిత్రాన్ని చూసి నవ్వు రావడం లేదని కామెంట్స్‌ చేసిన వారిని ఉద్దేశిస్తూ ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. సినిమాలోని ఓ సన్నివేశానికి థియేటర్‌ రెస్పాన్స్‌ తెలియజేస్తూ.. ‘‘హాస్యానికి స్పందించలేని మేధో సమీక్షకులందరికీ.. మా సమాధానం ఒక్కటే.. ఈ సినిమాకు థియేటర్ స్పందన ఇలా ఉంది’’ అంటూ ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. అందులో సినిమాను చూస్తూ థియేటర్లో ప్రేక్షకులు నవ్వుతున్నట్లుగా ఉంది.

అంజలి (Anjali) ప్రధాన పాత్రలో నటించిన హారర్‌ కామెడీ థ్రిల్లర్‌ ఇది. పదేళ్ల క్రితం విడుదలైన ‘గీతాంజలి’కి కొనసాగింపుగా ఇది సిద్ధమైంది. కోన వెంకట్‌ కథ, స్క్రీన్‌ప్లే అందించగా శివ తుర్లపాటి దర్శకత్వం వహించారు. శ్రీనివాస్‌రెడ్డి, సత్యం రాజేశ్‌, సత్య, షకలక శంకర్‌, సునీల్‌, అలీ, రవి శంకర్‌, రాహుల్‌ మాధవ్‌ కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 11న విడుదలైంది. సినిమాలో హాస్యం సరిగ్గా పండలేదని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని