Krithi Shetty: రిలేషన్‌షిప్‌లో ఉన్నారా?: కృతిశెట్టి రియాక్షన్‌ ఏంటంటే

శర్వానంద్‌, కృతిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘మనమే’ ప్రమోషన్స్‌లో కృతి బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రిలేషన్‌షిప్‌పై ఆమె స్పందించారు.

Published : 03 Jun 2024 16:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘బేబమ్మ’ (ఉప్పెన చిత్రం)గా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి కృతిశెట్టి (Krithi Shetty). త్వరలోనే ‘మనమే’ (Manamey)తో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా ప్రచారంలో పాల్గొన్న ఆమె ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే ‘మీరు సింగిలా? రిలేషన్‌షిప్‌లో ఉన్నారా?’ అని హోస్ట్‌ అడగ్గా ‘‘నా పనితో రిలేషన్‌లో ఉన్నా’’ అంటూ నవ్వులు పూయించారు. కాబోయేవాడు ఎలా ఉండాలన్న ప్రశ్నపై స్పందిస్తూ.. నిజాయతీ, ఇతరులపై దయ కలిగి ఉండాలన్నారు.

ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలు, సిరీస్‌లివే!

సినిమాల గురించి మాట్లాడుతూ.. ‘‘డ్యాన్స్‌ చేయడమంటే నాకు బాగా ఇష్టం. యాక్షన్‌ కూడా నచ్చుతుంది. హీరోల్లో రామ్‌ చరణ్‌ (Ram Charan) అభిమానిని. ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తా. ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ‘మనమే’ చిత్రంలో ఉన్నాయి. నేనిందులో సుభద్ర అనే యువతిగా కనిపిస్తా. పాత సినిమాల్లో చేసిన పాత్రల్ని మరిచిపోయి ఇందులో నటించమని చెప్పారు దర్శకుడు. ఈ పాత్ర ప్రయాణం చాలా తృప్తినిచ్చింది. నేను చిన్నారికి తల్లిగా కనిపిస్తానా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమా, సినిమాకీ వైవిధ్యాన్నే కోరుకుంటా. చేసిన పాత్రల్నే మళ్లీ మళ్లీ చేయడం నాకు నచ్చదు’’ అని తెలిపారు. శర్వానంద్‌ (Sharwanand) హీరోగా దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మనమే’. జూన్‌ 7న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని