Kriti Sanon: టెక్నాలజీని నిందించడం సరికాదు.. డీప్‌ ఫేక్‌లపై కృతి సనన్‌ కామెంట్స్‌

నటి కృతి సనన్‌ తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో డీప్‌ఫేక్‌ గురించి మాట్లాడారు.

Published : 03 Feb 2024 11:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: షాహిద్ కపూర్‌ (Shahid Kapoor), కృతి సనన్‌ (Kriti Sanon) ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం  ‘తేరీ బాతో మై ఐసా ఉల్జా జియా’.  అమిత్‌ జోషి, ఆరాధన సాహ్‌ దర్శకత్వంలో తెరకెక్కింది. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వీళ్లిద్దరూ డీప్‌ఫేక్ గురించి మాట్లాడారు. ఇది ఎంతో ఆందోళన కలిగిస్తుందన్నారు.

‘కొన్ని నెలల నుంచి ప్రముఖులకు చెందిన మార్ఫింగ్‌ వీడియోలు సంచలనం సృష్టిస్తున్నాయి. అలాగే కృత్రిమ మేధ సాయంతో చేసిన యాంకర్‌ను కూడా చూశాం. డీప్‌ఫేక్‌ల విషయంలో టెక్నాలజీని నిందించడం తప్పు. దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఏఐని సృష్టించింది కూడా మనుషులే అనే విషయం గుర్తుంచుకోవాలి. టెక్నాలజీ అభివృద్ధి చూస్తుంటే.. భవిష్యత్తులో ఏఐ మన భాగస్వామి అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు’ అని కృతి సనన్‌ అన్నారు. అలాగే, ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘తొలిసారి ఈ కథ విన్నప్పుడు ఇది కూడా ఒక అందమైన ప్రేమకథా చిత్రం. ఎలా ఉంటుందో. ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా? అనే ఆలోచనే ఉండేది. నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ కూడా బాగుందనే అనుకున్నా. కానీ ఎప్పుడయితే నా పాత్ర ఒక రోబో అని తెలిసిందో ఆశ్చర్యపోయాను. సిఫ్రా అనే రోబో పాత్రలో నేను చేసిన అల్లరి మాములుగా ఉండదు’ అని తన పాత్ర గురించిన విశేషాలు వెల్లడించారు.

‘హనుమాన్‌’ అరుదైన రికార్డు.. 92 ఏళ్ల టాలీవుడ్‌ చరిత్రలో..

మరో బాలీవుడ్‌ కథానాయిక భూమి పెడ్నేకర్‌ (Bhumi Pedneka) కూడా ఓ ఇంటర్వ్యూలో ఫేక్‌ వీడియోలపై మాట్లాడారు. ‘ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి. మన ఫొటోలు అలా చూసుకున్నప్పుడు ఎంత బాధగా ఉంటుందో నేను ఊహించుకోలేను. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చి వెంటనే అమలయ్యేలా చూడాలి’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని