kriti sanon: మనాలీ ఆనందం నింపింది

అభిమానులు మెచ్చాలంటే సినిమాల్లో నటించడమే కాదు, మంచి చిత్రాల్ని కూడా నిర్మించవచ్చని అంటోంది ప్రముఖ బాలీవుడ్‌ యువ కథానాయిక కృతి సనన్‌.

Updated : 07 Dec 2023 09:45 IST

అభిమానులు మెచ్చాలంటే సినిమాల్లో నటించడమే కాదు, మంచి చిత్రాల్ని కూడా నిర్మించవచ్చని అంటోంది ప్రముఖ బాలీవుడ్‌ యువ కథానాయిక కృతి సనన్‌. తన సొంత నిర్మాణ సంస్థ బ్లూ బటర్‌ఫ్లై ఫిలింస్‌ పతాకంపై ‘దో పత్తి’ అనే సినిమాను ఆమె నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తన నిర్మాణంలో రానున్న ఈ తొలి సినిమా కోసం కెమెరా వెనకాల ఉంటూ తన ప్రతిభను కనబరుస్తుంది. ప్రస్తుతం మనాలీలో జరుగుతున్న ఆ చిత్ర షెడ్యూల్‌ పూర్తైనట్టు కృతి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుపుతూ ఫొటోలను, వీడియోలను పంచుకుంది. ‘మనాలీ...ఎంతో అందంగా ఉంది. ‘దో పత్తి’ షెడ్యూల్‌ పూర్తి!. చల్లని వాతావరణం. ఆనందంతో నిండిన హృదయాలు!... జ్ఞాపకాలను అందిస్తూ మ్యాజిక్‌ని సృష్టించే ప్రయత్నం చేస్తున్న మనసులు. చిత్రబృందానికి ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చింది కృతి. శశాంక చతుర్వేది దర్శకత్వంలో రానున్న ఈ సినిమా సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకులను అలరించనుంది. ఇందులో కాజోల్‌తో పాటు కృతి కీలక పాత్ర పోషిస్తోంది. కరీనా కపూర్‌, టబులతో కలిసి ‘ది క్రూ’తో పాటు షాహిద్‌ కపూర్‌కి జోడీగా ఓ చిత్రంలో కనిపించనుంది కృతి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని