Kriti Sanon: సినిమా ప్రచారం కోసం.. రూ. 6 లక్షల ఖరీదైన డ్రెస్సు!

తన కొత్త సినిమా ‘గణపథ్‌’ ప్రచారం కోసం కృతి సనన్‌ ధరించిన స్టైలిష్‌ డ్రెస్సు అందరినీ ఆకట్టుకుంది. ఆ డ్రెస్సు ధర ఎంతంటే?

Published : 29 Sep 2023 19:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాల్లోనే కాదు కొందరు తారలు వేడుకల్లోనూ స్టైలిష్‌ దుస్తులతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. తాజాగా బాలీవుడ్‌ నటి కృతిసనన్‌ (Kriti Sanon) ఇటు సినీ అభిమానుల్ని, అటు ఫ్యాషన్‌ ప్రియుల్ని ఆకట్టుకున్నారు. తన కొత్త చిత్రం ‘గణపథ్‌’ (Ganapath)  సినిమా ప్రచారంలో కృతి సనన్‌ బ్లాక్‌ కలర్‌ డ్రెస్సులో హొయలొలికించారు. సంబంధిత ఫొటోలను ఆమె స్టైలిష్ట్‌ సుకృతి గ్రోవర్‌ నెట్టింట షేర్‌ చేశారు. ఆ డ్రెస్సు సింపుల్‌గా ఉన్నా ఎట్రాక్ట్ చేయడంతో దాని ఖరీదు తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపించారు. బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడిన కృతి స్టైలిష్ట్‌ ఆ వివరాలు వెల్లడించారు. ఆ డ్రెస్సును బ్రిటిష్‌కు చెందిన డిజైనర్‌ రూపొందించారని తెలిపారు. ఆ డిజైనర్‌కు చెందిన వెబ్‌సైట్‌లో దాని ఖరీదు 7,500 డాలర్లుగా (దాదాపు 6.2 లక్షలు) ఉందని తెలిపారు. ‘ఏంటీ.. ఈ డ్రెస్సు రూ. 6 లక్షలా’ అనే ఆశ్చర్యంలో ఉన్నారు కదూ!

‘రాజారాణి’ టు ‘జవాన్‌’.. నేనెంతో గర్వపడుతున్నా: అట్లీ సతీమణి పోస్ట్‌

టైగర్‌ ష్రాఫ్‌ (Tiger Shroff), కృతి సనన్‌ జంటగా నటించిన హై ఓల్టేజ్‌ యాక్షన్‌ చిత్రమే ‘గణపథ్‌’. వికాస్‌ బహ్ల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) కీలక పాత్ర పోషించారు. ఈ పాన్‌ ఇండియా చిత్రం దసరా కానుకగా అక్టోబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేస్తోంది. హీరో, హీరోయిన్లు ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. తాజాగా టీజర్‌ను విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని