Kriti Sanon: అవకాశాలు రాకపోతే సృష్టించుకోవాలి.. అందుకే నిర్మాతగా మారాను: కృతి సనన్‌

తనకు ప్రత్యేకంగా ఉండడం ఇష్టమని నటి కృతి సనన్‌ అన్నారు. స్వచ్ఛమైన ప్రేమ కథలో నటించాలని ఉందన్నారు.

Published : 11 Apr 2024 15:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అవకాశాలు రాకపోతే సృష్టించుకోవాలని నటి కృతి సనన్‌ (Kriti Sanon) అన్నారు. తాజాగా ‘ది క్రూ’తో విజయాన్ని అందుకున్న ఆమె.. టబు, కరీనాకపూర్‌లతో కలిసి ఆ చిత్రంలో అలరించారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు హిట్‌లను తన ఖాతాలో వేసుకున్న కృతి ‘దో పత్తి’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమె నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘నాకు ఎప్పటికప్పుడు కొత్తగా ప్రయత్నించడం ఇష్టం. సినీ రంగంలో నేర్చుకోవడానికి ఎన్నో అంశాలున్నాయి. కొన్నిసార్లు మనం కోరుకున్న అవకాశాలు రాకపోతే.. మనమే సృష్టించుకోవాలి. అందుకే నేను నిర్మాతగా మారాను. నేను  ఏది చేసినా ప్రత్యేకంగా ఉండాలనుకుంటాను. సినిమా అవకాశం వచ్చినా స్క్రిప్ట్‌ మొత్తం ఉత్సాహంగా చదువుతాను. సినీరంగంలోకి వచ్చినప్పుడే ఏదో ఒకరోజు నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నా. ‘మిమి’ షూటింగ్‌ సమయంలోనే ‘దోపత్తి’ స్క్రిప్ట్‌ విన్నాను. నా హృదయానికెంతో దగ్గరైంది. అది కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. కథ విన్నాక  కొన్ని మార్పులు చేశాం. ప్రాణం పెట్టి పనిచేశాం. నేను పూర్తి బాధ్యతలు తీసుకున్న తొలి చిత్రమిది. నిర్మాతగా నాకు చాలా తృప్తినిచ్చింది’ అన్నారు.

‘ఏ సినిమాకైనా కంటెంటే కింగ్‌. నేను దాన్నే నమ్ముతాను. ఏదైనా కథను ప్రేక్షకురాలిగా చదువుతాను. నచ్చితే ఆ సినిమాకు వెంటనే ఓకే చెబుతాను. చేసిన పాత్రలనే చేయడం నచ్చదు. విభిన్నమైన పాత్రలు, జానర్లలో నటించాలి. స్వచ్ఛమైన ప్రేమ కథలో నటించాలని ఉంది. కామెడీ చిత్రాలన్నా ఆసక్తి ఎక్కువే. కొన్నిసార్లు మన జీవితాల్లో జరిగే సంఘటనలు కూడా చాలా ఫన్నీగా అనిపిస్తాయి. అలాంటివి సినిమాల్లో ఉంటే ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తారు. నటిగా, నిర్మాతగా వాళ్లకు వినోదాన్ని పంచడమే నా లక్ష్యం’ అని కృతి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని