Kriti Sanon: 10 ఏళ్ల బాలీవుడ్‌ ప్రయాణంపై కృతి పోస్ట్‌.. శుభాకాంక్షలు చెబుతున్న ఫ్యాన్స్‌

పదేళ్ల బాలీవుడ్‌ ప్రయాణంపై కృతి సనన్‌ పోస్ట్‌ పెట్టారు. తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

Published : 23 May 2024 18:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌లో తన తొలి సినిమా విడుదలై పదేళ్లు పూర్తయిన సందర్భంగా నటి కృతి సనన్ (Kriti Sanon) పోస్ట్‌ పెట్టారు. ‘హీరోపంటీ’తో ఈ బ్యూటీ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత బీటౌన్‌లో వరుస సినిమాలు చేసి అలరిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై ఆనందం వ్యక్తంచేస్తూ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు.

‘హిందీ పరిశ్రమకు వచ్చి 10 ఏళ్లు గడిచాయంటే నమ్మలేకపోతున్నా. నిన్ననే మొదటిసారి సెట్‌లోకి అడుగుపెట్టానేమో అనిపిస్తుంది. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. మంచి స్నేహితులను, మరిచిపోలేని జ్ఞాపకాలను సొంతం చేసుకున్నా. నా ప్రయాణంలో భాగమై నన్ను ఆదరించిన అందరికీ, నన్ను నమ్మి ప్రోత్సహించిన దర్శకనిర్మాతలకు అభిమానులకు కృతజ్ఞతలు. పెద్ద కలలు కనాలి. వాటిని నిజం చేసుకునేందుకు కృషి చేయాలి. నేనూ అదే చేశాను.     నా ప్రయాణంలో మరెన్నో అద్భుతాలు చూడాలనుకుంటున్నా’ అని రాశారు. దీనిపై బాలీవుడ్‌ ప్రముఖులు, ఫ్యాన్స్‌ స్పందిస్తూ.. ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

‘మంజుమ్మ‌ల్ బాయ్స్‌’నిర్మాణ సంస్థకు ఇళయరాజా లీగల్‌ నోటీసులు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పాత్రల గురించి కృతి మాట్లాడుతూ.. సవాలుతో కూడిన పాత్రలంటే తనకు ఇష్టమని చెప్పారు. రోజూ కొత్తగా ప్రయత్నించే అవకాశమున్న ఇండస్ట్రీలో ఉన్నందుకు ఆనందం వ్యక్తంచేశారు. సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని.. ఇక్కడికి రావాలని కలలు కనేవారికి స్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కృతి ‘దో పత్తీ’(Do Patti,)తో బిజీగా ఉన్నారు. ‘బ్లూ బటర్‌ ఫ్లై ఫిలిమ్స్‌’ పతాకంపై ఆమె నిర్మించనున్న మొదటి చిత్రమిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని