Kriti Sanon: అల్లు అర్జున్‌తో నటించే అవకాశం త్వరగా రావాలనుకుంటున్నా..!

అల్లు అర్జున్‌తో (Allu arjun) కలిసి నటించాలని ఉందని కృతిసనన్‌ మరోసారి తన ఆసక్తిని బయటపెట్టారు. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

Updated : 28 Nov 2023 12:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటిగానే కాకుండా నిర్మాతగానూ బిజీగా మారారు కృతిసనన్‌ (Kriti Sanon). ఈ ఏడాది ఉత్తమ నటిగా జాతీయ అవార్డును స్వీకరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక ఆ వేడుకలో ఆమె అల్లు అర్జున్‌తో (Allu Arjun) దిగిన ఫొటో అప్పట్లో వైరల్ అయింది. అలాగే నాడు కృతి మాట్లాడుతూ.. తనకు బన్నీతో కలిసి నటించాలని ఉందని చెప్పారు. తాజాగా ఇదే విషయంపై కృతి మరోసారి స్పందించారు.

‘‘అల్లు అర్జున్‌ను మొదటిసారి జాతీయ అవార్డుల వేడుకలో ప్రత్యక్షంగా చూశాను. అప్పుడు మేమిద్దరం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అతడు అద్భుతమైన నటుడు. తన నటనకు నేను అభిమానిని. చాలా తెలివైన వ్యక్తి. బన్నీతో కలిసి పని చేసే క్షణం కోసం ఎదురుచూస్తున్నా. ఎవరైనా దర్శకుడు మా ఇద్దరితో సినిమా తీయాలని ఆశిస్తున్నా. ఇది త్వరగా జరగాలని కోరుకుంటున్నా’అని చెప్పారు. బన్నీతో కలిసి నటించాలని కృతి సనన్‌ చెప్పడం ఇదేం తొలిసారి కాదు. ఆమెకు జాతీయ అవార్డు వచ్చినందుకు అభినందిస్తూ అల్లు అర్జున్ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టగా.. దానికి ఆమె స్పందిస్తూ ‘మీతో కలిసి నటించాలని ఉంది’ అని రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే.

అమ్మాయిలందరికీ ఇదే చెప్పాలనుకుంటున్నా..: రష్మిక

ఇక నిర్మాతగా తాను తీస్తున్న ప్రాజెక్ట్‌ గురించి కృతి మాట్లాడుతూ.. ‘మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమాలను తీయాలనుకుంటున్నా. ప్రస్తుతం నిర్మిస్తున్న ‘దో పత్తి’ సవాళ్లతో కూడుకున్న చిత్రం. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌కు నిర్మాతగా వ్యవహరించడాన్ని గౌరవంగా భావిస్తున్నా’ అని చెప్పారు. ఇక చివరిసారిగా ‘ఆదిపురుష్‌’లో కనిపించిన కృతి.. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని