Rashmika: అమ్మాయిలందరికీ ఇదే చెప్పాలనుకుంటున్నా..: రష్మిక

తన డీప్‌ ఫేక్ వీడియోపై రష్మిక (Rashmika) మరోసారి స్పందించారు. తనకు చాలా మంది మద్దతు లభించిందన్నారు.

Published : 28 Nov 2023 10:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  హీరోయిన్ రష్మిక (Rashmika) డీప్‌ ఫేక్‌ వీడియో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఆమె మరోసారి స్పందించారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘యానిమల్‌’ (Animal) డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో ఆమె తన డీప్‌ ఫేక్‌ వీడియో, ట్రోల్స్‌పై మాట్లాడారు. 

‘దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఫేక్‌ వీడియోలు సృష్టించడం సర్వసాధారణమైపోయింది. అలాంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు కచ్చితంగా మనం స్పందించాలి. నాకు తొలుత అమితాబ్ బచ్చన్‌ సపోర్ట్‌ ఇచ్చారు.  ఆ తర్వాత ఇండస్ట్రీకి చెందిన చాలా మంది మద్దతు తెలిపారు. మొదట్లో ఆ వీడియో చూసి బాధపడ్డాను. చాలా మంది సెలబ్రిటీలకు ఇలానే జరుగుతోంది. ఏం చేయగలం అనిపించింది. దీన్ని సాధారణంగా తీసుకోకూడదనుకున్నా. అందుకే స్పందించాను. ఈ సందర్భంగా నేను అమ్మాయిలందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ఏదైనా సంఘటన మిమ్మల్ని ప్రభావితం చేసి బాధిస్తే.. మీరు నిశ్శబ్దంగా ఉండొద్దు. కచ్చితంగా స్పందించండి. అప్పుడు మీకు ప్రజల మద్దతు లభిస్తుంది. మనం గొప్ప దేశంలో నివసిస్తున్నాం’ అని చెప్పారు. ఇక సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌పై మాట్లాడుతూ.. ‘నాకు ప్రతి విషయంలో చాలా సపోర్ట్‌ ఉంటుంది. ఇక నటీనటులు, క్రికెటర్లపై మీమ్స్‌, ట్రోల్స్‌ సర్వసాధారణం. అలాంటి వాటిని పట్టించుకోకూడదు’ అన్నారు.

మరీ ఇంత దారుణమా.. అలియా డీప్‌ ఫేక్‌ వీడియో వైరల్‌

ఇక ‘యానిమల్‌’ విషయానికొస్తే.. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌-రష్మిక ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది. అనిల్‌ కపూర్‌, బాబీ దేవోల్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబరు 1న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని