Kriti Sanon: గతంతో పోలిస్తే ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయి.. నెపోటిజంపై కృతిసనన్‌

నటి కృతి సనన్‌ బాలీవుడ్‌లోని నెపోటిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సొంత వాళ్లకే కాకుండా ప్రతిభ ఉన్న వారికి కూడా అవకాశాలివ్వాలని కోరారు.

Updated : 15 Nov 2023 10:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీనేపథ్యం లేకపోయినా కృతి సనన్‌ (Kriti Sanon) తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. మోడల్‌ నుంచి బాలీవుడ్‌ హీరోయిన్‌గా ఎదగడానికి ఎంతో కష్టపడినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే హిందీ చిత్ర పరిశ్రమలో ఉన్న నెపోటిజం గురించి మాట్లాడారు.

‘‘బాలీవుడ్‌లో అగ్ర నిర్మాతల వారసులు ఎవరైనా తెరంగేట్రం చేస్తే వాళ్లకు ఎక్కువగా అవకాశాలు వస్తుంటాయి. ఎప్పుడూ సొంత మనుషులకే కాదు. ప్రతిభ ఉన్న వారికి కూడా చోటు కల్పించాలి. అందిరికీ సమాన అవకాశాలు కల్పించడం ప్రారంభిస్తే పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుంది. గతంతో పోలిస్తే ఇండస్ట్రీలో ఇప్పుడు పరిస్థితులు మారాయి. పెద్ద స్టార్ల కంటే ప్రతిభ ఉన్న వారి వైపే సినీ ప్రపంచం మొగ్గు చూపుతోంది’’ అని కృతి సనన్‌ అన్నారు.

‘జవాన్‌’ పాటకు చిరంజీవి డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

ఇక బాలీవుడ్‌లో నెపోటిజం గురించి కృతి మాట్లాడడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఇదే విషయంపై స్పందించారు.. తన కెరీర్‌ ఆరంభంలో ఎన్నో అవకాశాలు చేజారిపోయాయని తెలిపారు. కొన్ని సినిమాల్లో మొదట తనకు అవకాశమిచ్చి తర్వాత తన స్థానంలో కొందరు స్టార్‌ కిడ్స్‌ను తీసుకున్నట్లు వెల్లడించారు. ఇక ప్రస్తుతం కృతి సనన్‌ ఓ వైపు హీరోయిన్‌గా బిజీగా ఉంటూనే మరోవైపు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఓటీటీ వేదికగా పలు చిత్రాలను నిర్మిస్తున్నారు. అలాగే తాజాగా వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని