Kriti Sanon: నా స్థానంలో ఓ స్టార్‌ కిడ్‌ను తీసుకున్నారు: కృతి సనన్‌

నటిగానే కాకుండ నిర్మాతగానూ బిజీగా ఉంది హీరోయిన్ కృతిసనన్‌ (Kriti Sanon). గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె నెపోటిజంపై చేసిన వ్యాఖ్యలు తాజాగా తెరపైకి వచ్చాయి.

Published : 27 Jul 2023 14:41 IST

హైదరాబాద్‌: బాలీవుడ్‌ హీరోయిన్ కృతి సనన్‌ (Kriti Sanon) మహేష్ సరసన ‘నేనొక్కడినే’ సినిమాలో నటించి తెలుగు వారికి చేరువైంది. ఇటీవల ‘ఆదిపురుష్‌’లో (Adipurush) తన నటనలో మెప్పించి ఇక్కడ కూడా అభిమానులను సొంతం చేసుకుంది. అయితే నెపోటిజంపై గతంలో కృతి చేసిన కొన్ని ఆసక్తికర కామెంట్స్‌ ఇప్పుడు తెరపైకి వచ్చాయి. కొన్ని సినిమాల్లో మొదట తనను ఎంపిక చేసి ఆ తర్వాత ఆ స్థానంలో స్టార్ కిడ్స్‌ను తీసుకున్నారని చెప్పింది.

‘‘నా కెరీర్‌లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు చాలానే వచ్చాయి. ఆ విషయంలో నేను చాలా ఆనందంగా ఉన్నాను.  అవకాశాల కోసం దర్శకులను సంప్రదించడం నాకు ఇష్టం ఉండదు. మనకు వచ్చిన అవకాశాల్లో వందశాతం కష్టపడి నటిస్తే.. కొంతకాలం తర్వాత మన పనే మనకు ఆఫర్లను తెస్తుంది. కాకపోతే దానికి సమయం పడుతుంది. నాకు వచ్చిన ఆఫర్లు కొన్నిసార్లు చేజారిపోయాయి. ఇలా జరిగినప్పుడు బాధపడ్డాను. కొన్ని సినిమాల్లో మొదట నన్ను హీరోయిన్‌గా ఎంపిక చేసి తర్వాత కొంతమంది స్టార్‌ కిడ్స్‌ను నా స్థానంలో తీసుకున్నారు. దీని వెనుక ఏం జరిగిందో నాకు తెలీదు. ఆ పాత్రలను నాకంటే వాళ్లు బాగా చేయగలరని ఆ దర్శకుడు అనుకొని ఉండొచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో జయాపజయాలు ఉంటాయి. ఏది జరిగినా దాని వెనుక ఓ కారణం ఉంటుందని నేను అనుకుంటాను’’ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో కృతి సనన్‌ చెప్పింది.

 ‘ప్రైమ్‌ నుంచి ‘బవాల్‌’ను తొలగించండి’.. చిక్కుల్లో జాన్వీకపూర్‌ కొత్త చిత్రం

ప్రస్తుతం కృతి సనన్‌ నటిగానే కాకుండా నిర్మాతగానూ బిజీగా ఉంది. బాలీవుడ్‌లో అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తోంది. అమితాబ్‌ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఓ సినిమాతో పాటు షాహిద్ కపూర్‌ చిత్రంలోనూ కనిపించనుంది.  ‘బ్లూ బటర్‌ ఫ్లై’ అనే ప్రొడక్షన్‌ హౌస్‌ను ప్రారంభించింది. దీనిపై ‘దో పట్టి’ (Do Patti) అనే సినిమాను తెరకెక్కించనుంది. ఇందులో కాజోల్ (Kajol) లాంటి టాప్ హీరోయిన్‌లు నటిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని