Kriti Sanon: వేదిక ఏదైనా కథే ముఖ్యం

‘థియేటర్లు, ఓటీటీలకు కావాల్సింది మంచి కంటెంట్‌ మాత్రమే’ అని అంటోంది బాలీవుడ్‌ కథానాయిక కృతి సనన్‌. గతేడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈమె ఏ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.

Updated : 03 Jan 2024 11:58 IST

 

‘థియేటర్లు, ఓటీటీలకు కావాల్సింది మంచి కంటెంట్‌ మాత్రమే’ అని అంటోంది బాలీవుడ్‌ కథానాయిక కృతి సనన్‌. గతేడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈమె ఏ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. కానీ, జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకొని 2023ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. ‘బ్లూ బటర్‌ఫ్లై ఫిలిమ్స్‌’ సంస్థని నిర్మించి నిర్మాతగా కూడా మారింది. ఇటీవల తన సొంత నిర్మాణ సంస్థపై రానున్న సినిమా ‘దో పత్తీ’ చిత్రీకరణను పూర్తిచేసుకున్న కృతి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. తొలిసారి నిర్మాతగా వ్యవహరించిన కృతి తన అనుభవం గురించి మాట్లాడుతూ... ‘నటీనటులుగా మనం ఏ సినిమా చేసినా పాత్రలో మాత్రమే ఒదిగిపోతాం. కానీ, ‘దో పత్తీ’ ప్రయాణంలో ముఖ్య పాత్ర పోషిస్తూ... స్క్రిప్ట్‌ దశ నుంచి పాత్రలు, సంగీతం.. ఇలా అన్నీ దశల్లో నేను పాల్గొన్నాను. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాము’ అని తెలిపింది. ‘సినిమాలు థియేటర్లలో విడుదలైనా, ఓటీటీ వేదికగా విడుదలైనా కథ బాగుంటే ప్రేక్షకులు తప్పక విజయాన్ని అందిస్తారు. ఆ రెండింటికీ కావాల్సింది కంటెంట్‌ మాత్రమే. లార్జర్‌-దేన్‌-లైఫ్‌ కథలనే సినీ ప్రియులు ఆస్వాదిస్తారు’ అని అంది కృతి. కాజోల్‌ నటించిన ‘దో పత్తి’ నెట్‌ఫ్లిక్స్‌లో అలరించేందుకు సిద్ధమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని