Ayalaan: ఓటీటీలోకి అయలాన్‌.. తెలుగు రిలీజ్‌ ఎప్పుడు..?

‘అయలాన్‌’ (Ayalaan) సినిమా ఓటీటీ రిలీజ్‌కి రంగం సిద్ధమైంది. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ సంస్థ పోస్ట్‌ పెట్టింది.

Published : 29 Jan 2024 15:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan) ప్రధాన పాత్రలో నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘అయలాన్‌’ (Ayalaan). రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) కథానాయిక. రవికుమార్‌ దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీలో విడుదలకు రంగం సిద్ధమైంది. సన్‌ నెక్స్ట్‌ వేదికగా త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈవిషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టింది. ఏయే భాషల్లో అందుబాటులో ఉండనుంది? రిలీజ్‌ డేట్‌ ఎప్పుడు? వంటి వాటిపై స్పష్టతనివ్వలేదు. మరోవైపు, ‘అయలాన్‌’ తెలుగు రిలీజ్‌కు చిత్రబృందం సన్నాహాలు చేసింది. జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంది. ఈమేరకు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సైతం నిర్వహించారు. అనుకోని కారణాల వల్ల రిలీజ్‌ వాయిదా పడింది. తెలుగులో ఎప్పుడు విడుదల కానుందనే దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు.

Sheena Bora Case: ఓటీటీలోకి సంచలన ‘షీనా బోరా కేసు’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

కథేంటంటే: ఒక మిషన్‌లో భాగంగా భూమ్మీదకు వచ్చిన ఏలియన్‌.. తమీజ్‌ (శివ కార్తికేయన్‌)ను కలుస్తుంది. కొద్దిరోజులకే వారి మధ్య స్నేహం పెరుగుతుంది. తమీజ్‌ దానికి టట్టూ అనే పేరు పెడతాడు. కొన్ని సంఘటనల వల్ల టట్టూ కొంతమంది వ్యక్తుల చేతుల్లో చిక్కుతుంది. దాన్ని కాపాడటం కోసం తమీజ్‌ ఏం చేశాడు? అసలు టట్టూ భూమ్మీదకు రావడానికి ప్రధాన కారణం ఏమిటి? తన మిషన్‌ పూర్తి చేసుకుని అది తిరిగి తన లోకానికి ఎలా వెళ్లింది? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా సిద్ధమైంది. ఏలియన్‌ పాత్రకు సిద్ధార్థ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని