Lokesh Kanagaraj: లోకేశ్‌ కనగరాజ్‌ ఆఫర్‌.. నో చెప్పిన షారుక్‌..?

లోకేశ్‌ కనగరాజ్‌  (Lokesh Kanagaraj) తెరకెక్కించనున్న ఓ సినిమాలో నటించేందుకు షారుక్‌ సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.

Published : 17 Dec 2023 10:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఖైదీ’ (Kaithi), ‘విక్రమ్‌’ (Vikram).. ఇలా యాక్షన్‌, ఎమోషనల్‌ కథా చిత్రాలతో బాక్సాఫీస్‌ వద్ద వరుస హిట్స్‌ అందుకున్నారు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj). ఈ ఏడాది ‘లియో’ (LEO)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించిన ఆయన ప్రస్తుతం రజనీకాంత్‌ (Rajinikanth) ప్రాజెక్టు కోసం పని చేస్తున్నారు. ‘తలైవా 171’గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం ఓ బాలీవుడ్‌ స్టార్‌ను తీసుకోవాలని లోకేశ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఇప్పటికే బాలీవుడ్‌ నటుడు షారుక్‌ ఖాన్‌(Shah Rukh Khan)ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల తాను చాలా చిత్రాల్లో అతిథి పాత్రలు పోషించానని.. ప్రస్తుతం తన సినిమాలపైనే పూర్తిగా ఫోకస్‌ పెట్టాలనుకుంటున్నానని షారుక్‌ ఆయనకు చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. 

Manchu Manoj: తండ్రి కాబోతున్న మంచు మనోజ్‌.. ట్వీట్‌ చేసిన నటుడు

దీంతో మరో బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ను లోకేశ్‌ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌పై రణ్‌వీర్‌ ఆసక్తిగా ఉన్నారని, కథ కూడా వినేందుకు అంగీకరించినట్లు సమాచారం. అయితే, ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

సోషల్‌ మీడియా నుంచి లోకేశ్‌ బ్రేక్‌..

‘‘నేను ప్రారంభించిన ‘జీస్క్వాడ్‌’ బ్యానర్‌ సమర్పణలో విడుదలైన ‘ఫైట్‌క్లబ్‌’ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. అన్ని రకాల సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌, సెల్‌ఫోన్‌ నుంచి కొంతకాలం పాటు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నా. రానున్న రోజుల్లో నా తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నా. కాబట్టి, నేను ఎవరికీ అందుబాటులో ఉండను. త్వరలో మళ్లీ కలుద్దాం’’ అని ఆయన శనివారం ఎక్స్‌లో పోస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని