Manchu Manoj: తండ్రి కాబోతున్న మంచు మనోజ్‌.. ట్వీట్‌ చేసిన నటుడు

నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) శుభవార్త చెప్పారు. త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు తెలిపారు.

Published : 17 Dec 2023 01:57 IST

హైదరాబాద్‌: నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) శుభవార్త చెప్పారు. ఆయన సతీమణి మౌనిక (Mounika) త్వరలో తల్లి కాబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం మనోజ్‌ ట్వీట్‌ చేశారు. తన అత్తయ్య శోభా నాగిరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆయన ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ సంతోషకరమైన సమయంలో అందరి ఆశీస్సులు తమకు ఉండాలని కోరుకున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. మనోజ్‌ - మౌనిక దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Social Look: నయన్‌ - విఘ్నేశ్‌ పూజలు.. సంగీత్‌లో పూజ మెరుపులు..!

మనోజ్‌ - మౌనిక ఎంతోకాలం నుంచి స్నేహితులు. కొన్నేళ్ల క్రితం వీరి స్నేహం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో ఈ ఏడాది మార్చి నెలలో వీరి వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఇక, సినిమాల విషయానికి వస్తే.. మనోజ్‌ ప్రస్తుతం ‘వాట్‌ ది ఫిష్‌’ కోసం వర్క్‌ చేస్తున్నారు. వరుణ్‌ కోరుకొండ దర్శకత్వంలో ఇది సిద్ధం కానుంది. దీనితోపాటు ఆయన ‘ఉస్తాద్‌’ అనే సెలబ్రిటీ గేమ్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని