Shruti Haasan: లోకేశ్‌ కనగరాజ్‌ అప్పుడు నాకు నో చెప్పారు: శ్రుతిహాసన్‌

‘ఇనిమేల్’ సాంగ్‌తో తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు లోకేశ్‌ కనగరాజ్ (Lokesh Kanagaraj), శ్రుతిహాసన్‌ (Shruti Haasan). రొమాంటిక్‌, లవ్‌ సాంగ్‌గా సాగే ఈ ఆల్బమ్‌ కోసం లోకేశ్‌ కనగరాజ్‌ నటుడిగా మారారు.

Published : 24 Mar 2024 12:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఇనిమేల్‌’ ఆల్బమ్‌ కోసం నటుడిగా మారారు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj). ఇందులో ఆయన శ్రుతిహాసన్‌ (Shruti Haasan)తో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. దీని ప్రమోషన్స్‌లో భాగంగా వారిద్దరూ తాజాగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ‘ఇనిమేల్‌’ ఆఫర్‌ను తొలుత లోకేశ్‌ కనగరాజ్‌ తిరస్కరించారని ఆమె చెప్పారు.

‘‘లోకేశ్ కనగరాజ్‌ ఫేస్‌ కెమెరాకు చక్కగా సెట్‌ అవుతుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఈ క్రమంలోనే ‘ఇనిమేల్‌’లో రోల్‌ ఆఫర్‌ చేశా. వెంటనే ఆయన నో చెప్పారు. చివరకు కాన్సెప్ట్ విని.. ఓకే అన్నారు. చాలా చక్కగా నటించారు’’ అని తెలిపారు. ‘‘నిజమే మొదట నేను ‘నో’ చెప్పా. కానీ, రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ నుంచి ఏదైనా అవకాశం వస్తే ‘నో’ చెప్పే స్థితిలో నేను లేను. పాట విన్నాను. ఒక్కసారి ప్రయత్నిద్దామనుకున్నా’’ అని లోకేశ్‌ కనగరాజ్‌ అన్నారు.

‘ఖైదీ’ ‘విక్రమ్‌’ లాంటి చిత్రాలతో కోలీవుడ్‌ స్టార్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj). గతేడాది ‘లియో’తో అలరించిన ఆయన ఇప్పుడు నటుడిగా అవతారమెత్తారు. ఇటీవల ‘సింగపూర్‌ సెలూన్‌’లో అతిథిగా కనిపించారు. తాజాగా శ్రుతిహాసన్‌తో స్పెషల్‌ ఆల్బమ్‌ కోసం వర్క్ చేశారు. ‘ఇనిమేల్‌’ ప్రోమో ఇటీవల విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. మార్చి 25న ఫుల్‌ విడుదల కానుంది. దీనికి కమల్‌ హాసన్ లిరిక్స్‌ అందించగా.. శ్రుతిహాసన్‌ కంపోజ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని