Mama Mascheendra: ప్రచారంలో కొత్త పంథా.. ఇండియన్‌ సినిమా చరిత్రలో తొలిసారిగా!

సుధీర్‌ బాబు హీరోగా హర్ష వర్దన్‌ తెరకెక్కించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఈ సినిమా ప్రీమియర్‌ని చూసే ప్రేక్షకుల స్పందనను లైవ్‌ టెలీకాస్ట్‌ చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

Published : 04 Oct 2023 19:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాని రూపొందించడం ఒకెత్తు అయితే దాన్ని ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా ప్రచారం చేయడం మరో ఎత్తు. ఈ విషయంలో ఒక్కో చిత్ర బృందాన్ని ఒక్కో స్టైల్‌. ఈ క్రమంలో వచ్చిందే ‘పెయిడ్‌ ప్రీమియర్‌’ కాన్సెప్ట్‌. అంటే ఎంపిక చేసిన థియేటర్‌లలో ప్రేక్షకులు కొత్త సినిమాను విడుదలకన్నా ముందే చూడొచ్చు. సినిమా బాగుందని టాక్‌ వినిపిస్తే మంచి ఓపెనింగ్స్‌ వస్తాయి. ఈ పంథాలో ‘మామా మశ్చీంద్ర’ (Mama Mascheendra) మరో అడుగు ముందుకేసింది. ప్రీమియర్‌ షో చూసే ప్రేక్షకుల స్పందనను యూట్యూబ్‌/సోషల్‌ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. నటీనటులు, సాంకేతిక బృందంతో ప్రేక్షకుల ముచ్చట్లనూ లైవ్‌ టెలీకాస్ట్‌ చేయనుంది. ఇలా చేయడం ఇండియన్‌ సినిమా చరిత్రలో తొలిసారి అని పేర్కొంది. శుక్రవారం విడుదలకానున్న ఈ చిత్రాన్ని హైదరాబాద్‌లోని ఎ.ఎం.బి. సినిమాస్‌లో గురువారం ఉదయం 10 గం. 30 ని.లకు ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

అప్పుడు నష్టాలు చూశా.. ఒత్తిడికి లోనయ్యా: అనితా చౌదరి

సుధీర్‌ బాబు (Sudheer Babu) హీరోగా నటుడు, రచయిత హర్ష వర్దన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. విభిన్న కథతో రూపొందిన ఈ సినిమాలో సుధీర్‌ త్రిపాత్రాభినయం చేశారు. భారీకాయుడిగా, డాన్‌గా, డీజేగా ఆయన సందడి చేయనున్నారు. ఈషా రెబ్బా, మృణాళిని రవి కథానాయికలు. ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సుధీర్‌ మాట్లాడుతూ.. ఇందులోని పాత్రలు సవాలుతో కూడుకున్నవని, భూతద్దంతో ఈ సినిమాని చూడొద్దని క్రిటిక్స్‌, మీమర్స్‌కు విజ్ఞప్తి చేశారు. ఓ పాత్ర విషయంలో మేకప్‌ సరిగా లేదని ఓ మీమర్‌ క్రియేట్‌ చేసిన మీమ్‌పై ఆయన అలా స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని