Nithiin: టాలీవుడ్ హీరోకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ధోని.. ఫొటో వైరల్‌

టాలీవుడ్‌ హీరో నితిన్‌కు టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ పంపారు. దీనికి సంబంధించిన ఫొటోను ఆయన షేర్ చేశారు.

Published : 29 Nov 2023 17:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెట్‌ స్టేడియంకు సినీ ప్రముఖులు వెళ్లి సందడి చేస్తుంటారు. అలాగే తాజా సినిమాలపై క్రికెటర్లు కూడా పోస్ట్‌లు పెడుతూ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతుంటారు. ఇక సమయం వచ్చినప్పుడల్లా సినీ, క్రీడా ప్రముఖులు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. తాజాగా టాలీవుడ్‌ హీరో నితిన్‌కు(Nithiin) టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ (Mahendra Singh Dhoni) ఓ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ పంపారు.

నితిన్ తాజా చిత్రం ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్‌’ (Extra Ordinary Man). ఈ సినిమా విజయం సాధించాలని కోరుతూ ధోనీ ఆటోగ్రాఫ్‌ చేసిన టీషర్ట్‌ను నితిన్‌కు గిఫ్ట్‌గా పంపారు. ఈ ఫొటోపై నితిన్‌ పోస్ట్‌ పెట్టారు. ‘‘ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌ నుంచి ఎక్స్‌ట్రార్డినరీ బహుమతి వచ్చింది. ధన్యవాదాలు ధోనీ గారు. లవ్‌ యూ’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు కూడా సంతోషంతో సూపర్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వైఫల్యాలు నేర్పినన్ని పాఠాలు ఎవరూ నేర్పరు..: నాగచైతన్య

ఇక ప్రస్తుతం నితిన్‌ ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మేన్‌’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించింది. డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా దీని ట్రైలర్‌ను విడుదల చేయగా దానికి మంచి ప్రేక్షకాదరణ వచ్చింది. ఈ చిత్రంపై నితిన్‌ మాట్లాడుతూ.. ‘ప్రేక్షకుల్ని నవ్వించాలన్న ఒకే లక్ష్యంతో ఈ చిత్రం చేశాం. సినిమా మొదలైనప్పటి నుంచి ముగింపు వరకు నవ్విస్తూనే ఉంటాం’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని