Malavika Mohanan: డబ్బింగ్‌ అంటే నాకు భయం..: మాళవికా మోహనన్‌

విక్రమ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan). ఈ సినిమా గురించి మాళవికా మోహనన్ పోస్ట్ పెట్టారు.

Published : 01 Dec 2023 12:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే తారల్లో నటి మాళవిక మోహనన్‌ ఒకరు. అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటించే మాళవిక తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్‌లను తరచూ షేర్‌ చేస్తుంటారు. ప్రస్తుతం ఆమె విక్రమ్‌ హీరోగా రూపొందుతోన్న ‘తంగలాన్‌’ (Thangalaan)లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన దీని టీజర్‌లోనూ ఆమె తన లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను షేర్‌ చేస్తూ మాళవిక చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

రివ్యూ: ‘అథ‌ర్వ‌’ ప్రయోగంతో ఆకట్టుకున్నాడా!

వైవిధ్యమైన కథతో రూపొందుతోన్న ఈ చిత్ర షూటింగ్‌ పూర్తయింది. తాజాగా దీని డబ్బింగ్‌ పనులు మొదలయ్యాయి. ఈ విషయాన్ని తెలిపిన మోహనన్‌.. ‘సినిమా మేకింగ్‌లో నాకు డబ్బింగ్‌ చెప్పడమే అన్నిటికంటే కష్టమైన పని. నేను ఈ సినిమాకు డబ్బింగ్‌ చెప్పేటప్పడు ఎవరైనా వచ్చి నాచేయి పట్టుకుని ధైర్యాన్నిస్తారా’ అంటూ సరదాగా పోస్ట్‌ పెట్టారు. దీనికి నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్స్‌ పెడుతున్నారు. ఇక ‘తంగలాన్‌’ విషయానికొస్తే.. పా రంజిత్‌ (Pa Ranjith) దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. కర్ణాటక, కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీయఫ్‌)లోని కార్మికుల జీవితాల చుట్టూ జరిగే వాస్తవిక ఘటనల ఆధారంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇందులో విక్రమ్‌ ఓ తండాకు చెందిన వ్యక్తిగా కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతీయ, విదేశీ భాషల్లో 2డీ, 3డీలో సిద్ధమవుతోంది. 2024 జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. పశుపతి, డానియల్‌ కాల్టాగిరోన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని