Mama Mascheendra: ఓటీటీలోకి ‘మామా మశ్చీంద్ర’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

సుధీర్‌ బాబు హీరోగా హర్ష వర్ధన్‌ తెరకెక్కించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది.

Published : 16 Oct 2023 19:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: థియేటర్లలో విడుదలైన రెండువారాల్లోనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది ‘మామా మశ్చీంద్ర’ (Mama Mascheendra) చిత్రం. సుధీర్‌ బాబు (Sudheer Babu) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 6న థియేటర్ల వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నెల 20 నుంచి తెలుగు ఓటీటీ ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్‌ కానుంది. నటుడు హర్ష వర్ధన్‌ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రమిది. సుధీర్‌ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ఈషా రెబ్బా, మృణాళిని రవి కథానాయికలుగా అలరించారు. అజయ్‌, అలీ రెజా, రాజీవ్‌ కనకాల, హరితేజ, మిర్చి కిరణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

హారర్‌ సినిమా.. ఆ సీన్స్‌ చేస్తున్నప్పుడు ఏదో ఒక ఇబ్బంది ఎదురయ్యేది

క‌థేంటంటే: క్రూరుడైన తండ్రి వ‌ల్ల చిన్న‌ప్పుడే త‌ల్లిని కోల్పోతాడు ప‌ర‌శురామ్ (సుధీర్‌ బాబు). త‌నకి ద‌క్కాల్సిన ఆస్తుల్ని మేన‌మామ (అజ‌య్‌) లాగేసుకోవ‌డంతో ఎలాగైనా ఆ ఆస్తిని తిరిగి రాబ‌ట్టుకోవాల‌ని ప‌థ‌కం ర‌చిస్తాడు. మామ‌కు కూతురుతో స‌మానమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని అనుకున్న‌ట్టే ఆస్తిని తిరిగి సొంతం చేసుకుంటాడు. ఆ త‌ర్వాత ప‌ర‌శురామ్ భార్య ఓ పాప‌కి జ‌న్మినిచ్చి చ‌నిపోతుంది. త‌న మామ పేరిట ఉన్న ఆస్తుల‌న్నింటినీ అమ్మేసుకుని కూతురుతో స‌హా వెళ్లి పారిస్‌లో స్థిర‌ప‌డిపోవాల‌ని నిర్ణ‌యించుకుంటాడు ప‌ర‌శురామ్‌. ఆ ప్ర‌య‌త్నాల్లో ఉండ‌గానే అత‌నిపై హ‌త్యాయ‌త్నం జ‌రుగుతుంది. ఇంత‌కీ ప‌ర‌శురామ్‌ని హ‌త్య చేయాల‌నుకున్న‌దెవ‌రు? త‌న రూపురేఖ‌ల‌తోనే ఉన్న క‌వ‌ల‌లు డీజే, దుర్గ (సుధీర్‌)లకి ఈ హ‌త్య‌తో సంబంధం ఏమైనా ఉందా? వాళ్లిద్ద‌రినీ హ‌త్య చేయాల‌ని ప‌ర‌శురామ్ ముందే ఎందుకు ప్లాన్ చేశాడు?వైర‌ల్ విశాలాక్షి (ఈషా రెబ్బా), మీనాక్షి (మృణాళిని ర‌వి)ల్లో ప‌ర‌శురామ్ కూతురు ఎవ‌రు? అన్నది మిగతా కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని