Manisha Koirala: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను కలిసిన మనీషా కొయిరాల.. ఎందుకంటే

బాలీవుడ్‌ నటి మనీషా కొయిరాల బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను కలిశారు. ఆ ఫొటోలను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు.

Published : 22 May 2024 12:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటి మనీషా కొయిరాల బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను కలిశారు. యూకే-నేపాల్‌ బంధానికి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక వేడుకలు ఏర్పాటు చేశారు. ప్రధాని నివాసమైన 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లో జరిగిన ఆ కార్యక్రమాలకు నేపాల్‌ తరఫున మనీషా (Manisha Koirala) హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. ‘ఈ వేడుకలకు హాజరవ్వడం చాలా సంతోషకరం. రిషి సునాక్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆయన కుటుంబాన్ని (Rishi Sunak) ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కు ట్రెక్కింగ్‌ రావాలని ఆహ్వానించాను. అన్నిటికంటే ముఖ్యమైన విషయమేమిటంటే.. చాలా మంది అతిథులు ‘హీరామండి’ వెబ్‌ సిరీస్‌ చూశామని.. నచ్చిందని చెప్పారు. అది వినగానే నాకెంతో థ్రిల్‌గా అనిపించింది’ అని రాసుకొచ్చారు.

అతడి ప్రవర్తనకు భయపడ్డా: కాజల్‌ అగర్వాల్‌

మనీషా కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్న సంగతితెలిసిందే. ఆమె తండ్రి ప్రకాష్ కొయిరాల రాజకీయ నాయకుడు. ఆమె తాత బిశ్వేశ్వర్‌ ప్రసాద్‌ కొయిరాలా 1959లో నేపాల్‌ ప్రధానమంత్రిగా పనిచేశారు. సినిమాల విషయాకొస్తే.. కొన్నేళ్ల విరామం తర్వాత సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’లో (Heeramandi) ఆమె కనిపించారు. మల్లికాజాన్‌ పాత్రలో అలరించారు. ఇందులో ఆమెతో పాటు అదితిరావు హైదరి, రిచా చద్ధా, షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్‌ ఇతర కీలకపాత్రలు పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని