Manjummel Boys: రికార్డు సృష్టించిన మలయాళ చిత్రం.. తెలుగు రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

మలయాళ హిట్‌ చిత్రం ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ తెలుగులో విడుదల కానుంది. ఎప్పుడంటే?

Published : 26 Mar 2024 18:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మలయాళ చిత్ర పరిశ్రమకు సంబంధించి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో తొలి స్థానం కైవసం చేసుకుంది ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ (Manjummel Boys). తక్కువ బడ్జెట్‌తో రూపొంది, రూ. 200 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ఈ మూవీ టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇప్పుడా హిట్‌ స్టోరీని తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్‌, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సిద్ధమయ్యాయి. అదే టైటిల్‌తో ఏప్రిల్‌ 6న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల (Manjummel Boys telugu version release date) చేయనున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాయి. శ్రీనాథ్‌ భాసి, బాలు వర్గీస్‌, గణపత్‌, లాల్‌ జూనియర్‌, దీపక్‌ కీలక పాత్రల్లో దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ఈ సర్వైవల్‌ థ్రిల్లర్‌ ఫిబ్రవరి 22న మలయాళంలో విడుదలైంది. 

రామ్‌ చరణ్‌-సుకుమార్‌ సినిమాలో అదే హైలైట్‌: రాజమౌళి

ఈ బాయ్స్‌ కథేంటంటే: కొచ్చికి చెందిన పలువురు స్నేహితులు కొడైకెనాల్‌ ట్రిప్‌నకు వెళ్తారు. అక్కడి ‘గుణ గుహ’ గురించి తెలుసుకుని సర్‌ప్రైజ్ అవుతారు. కమల్‌ హాసన్‌ ‘గుణ’ మూవీ అక్కడే తీశారని తెలియడంతో అందులోకి వెళ్తారు. గుహలో ఉన్న నిషేధ ప్రదేశాల్లోకి వెళ్లొద్దని గైడ్‌ చెప్పినా వినిపించుకోరు. ప్రమాదం అని రాసి ఉన్నా కూడా పట్టించుకోరు. ఓ పాయింట్‌ వద్దకు చేరుకున్న తర్వాత అక్కడి రాళ్లపై ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ అని రాస్తారు. తర్వాత, వారిలోని ఓ సభ్యుడు గుహలో ఉన్న ఓ రంధ్రంలో పడిపోతాడు. అతడు సరదాకు అలా చేశాడని మిగిలినవారంతా అనుకుంటారు. కానీ, ఎన్నిసార్లు పిలిచినా మాట రాకపోయేసరికి భయపడి బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి వారంతా ఎలాంటి సాహసం చేశారనేది మిగతా కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని