Manushi Chhillar: రష్మిక యాక్టింగ్‌ సూపర్‌.. ఆ రోల్‌ కోసం తొలుత నన్నే అడిగారు: మాజీ ప్రపంచ సుందరి

తన సరికొత్త చిత్రం ‘బడే మియా ఛోటే మియా’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నటి మానుషి చిల్లర్‌ (Manushi Chhillar).

Updated : 21 Apr 2024 13:46 IST

ముంబయి: ‘బడే మియా ఛోటే మియా’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు మాజీ ప్రపంచ సుందరి, నటి మానుషి చిల్లర్‌ (Manushi Chhillar). తన నటనను సవాలు చేసే పాత్రల కోసం వేచి చూస్తున్నానని అన్నారు. సందీప్ రెడ్డి వంగా చిత్రాలంటే తనకెంతో ఇష్టమని, భవిష్యత్తులో అవకాశం వస్తే తప్పకుండా ఆయనతో కలిసి పని చేస్తానని అన్నారు.

‘‘సందీప్‌ రెడ్డి వంగా చిత్రాలంటే నాకెంతో ఇష్టం. ఆయన ప్రాజెక్టుల్లో నటించాలని ఉంది. ఇటీవల ‘యానిమల్‌’ చూశా. రష్మిక పోషించిన గీతాంజలి పాత్ర నాకెంతో నచ్చింది. కుటుంబంలో కలతలు వచ్చినప్పుడు తను ధైర్యంగా నిలబడింది. రష్మిక నటన అద్భుతం. నటిగా నన్ను సవాలు చేసే అలాంటి పాత్రలు చేయాలని ఉంది’’ అని చెప్పారు.

‘అర్జున్‌రెడ్డి’కి రీమేక్‌గా తెరకెక్కిన ‘కబీర్‌సింగ్‌’లో ప్రీతి పాత్ర కోసం చిత్రబృందం తొలుత తననే సంప్రదించిందని.. అయితే, షాహిద్‌ మూవీలో హీరోయిన్‌ ఛాన్స్‌ వచ్చిందనే విషయం తెలియక తాను రిజక్ట్‌ చేశానన్నారు. అదీ కాక, ఆ సమయంలోనే తాను మిస్‌ వరల్డ్‌ కిరీటాన్ని గెలుపొందానని.. దాంతో ఏడాదిపాటు ఆ బృందంతో కాంట్రాక్ట్‌ కుదిరిందన్నారు. ఆ కారణంతోనే సినిమా చేయలేకపోయానని తెలిపారు. వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’తో ఆమె తెలుగు వారికి పరిచయమయ్యారు. వైమానిక ద‌ళంలోనే ప‌నిచేసే రాడార్ ఆఫీస‌ర్ అహ‌నా గిల్ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని