Prabhas: ‘రాజాసాబ్‌’ రిలీజ్‌.. మారుతి ఏమన్నారంటే..?

ప్రభాస్‌ (Prabhas) హీరోగా మారుతి రూపొందిస్తోన్న చిత్రం ‘రాజాసాబ్‌’ (Rajasaab). దీని రిలీజ్‌పై దర్శకుడు మారుతి స్పందించారు.

Published : 29 Jan 2024 17:23 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ (Prabhas) - మారుతి (Maruthi) కాంబోలో సిద్ధమవుతోన్న చిత్రం ‘రాజా సాబ్‌’ (Raja Saab). రొమాంటిక్‌ హారర్‌ కామెడీ నేపథ్యంలో ఇది తెరకెక్కుతోంది. తాజాగా ‘ట్రూ లవర్‌’ టీజర్‌ ఈవెంట్‌లో పాల్గొన్న మారుతి ‘రాజాసాబ్‌’ విడుదలపై స్పందించారు. ‘‘మన చేతుల్లో ఏం లేదు. సమయం వచ్చినప్పుడు అదే రిలీజ్‌ అవుతుంది. దీనికంటే ముందు ప్రభాస్‌ నటిస్తున్న పెద్ద సినిమా విడుదల కానుంది. అది విడుదలయ్యాకే దీనికి సంబంధించిన అప్‌డేట్‌లు, రిలీజ్‌డేట్‌ విశేషాలు తెలియజేస్తా. తప్పకుండా అందరికీ నచ్చే డేట్‌లోనే ఇది విడుదలవుతుంది’’ అన్నారు.

‘శ్రీమంతుడు’ కథపై వివాదం.. దర్శకుడు కొరటాల శివకు సుప్రీంలో చుక్కెదురు

మారుతి - ప్రభాస్‌ కాంబోలో వస్తోన్న తొలి చిత్రమిది. సంక్రాంతి కానుకగా చిత్రబృందం ఈ మూవీ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించింది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ దీనిని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘సలార్‌’తో విజయాన్ని అందుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం ‘కల్కి 2898 ఏడీ’లో నటిస్తున్నారు. ఫిక్షనల్‌ కథతో భారీ స్థాయిలో దీనిని తీర్చిదిద్దుతున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. వేసవి కానుకగా ఇది విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని