Masthu Shades Unnai Ra: ఓటీటీలోకి అభినవ్‌ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

‘సేవ్‌ ది టైగర్స్‌’ వెబ్‌ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్‌ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌ రా’ (MasthuShadesUnnaiRa).

Published : 28 Mar 2024 11:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘సేవ్‌ ది టైగర్స్‌ - 1, 2’తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించారు నటుడు అభినవ్‌ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌ రా’ (Masthu Shades Unnai Ra). తిరుపతి రావు దర్శకుడు. వైశాలీ రాజ్‌, అలీ రెజా కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. ఇప్పుడీ సినిమా ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైంది.  అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా మార్చి 29 (శుక్రవారం) నుంచి ఇది స్ట్రీమింగ్‌ కానుంది.

కథేంటంటే: మనోహర్‌ (అభినవ్‌ గోమఠం) ఒక కళాకారుడు. ఇంట్లో వాళ్ల కోసం పెళ్లికి సిద్ధపడతాడు. అతడు జీవితంలో స్థిరపడలేదన్న కారణంతో వధువు మండపం నుంచి పారిపోతుంది. దీంతో అతడిని బంధువులు, చుట్టుపక్కల వాళ్లు చులకనగా చూడటం మొదలుపెడతారు. ఈ సంఘటనతో ఎలాగైనా జీవితంలో స్థిరపడాలనుకుంటాడు మనోహర్‌. ఈక్రమంలోనే అతడికి ఉమ (వైశాలీ రాజ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. మనోహర్‌ - ఉమ పెళ్లి చేసుకున్నారా? మనోహర్‌ జీవితంలో ఎలా స్థిరపడ్డాడు? అనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని