Upcoming Movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే.. ఇటు ఫన్‌.. అటు థ్రిల్‌

ఈ వారం థియేటర్లో, ఓటీటీల్లో సందడి చేసేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. అవేంటంటే?

Published : 14 May 2024 09:48 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టాలీవుడ్‌లో సంక్రాంతి తర్వాత పెద్ద సీజన్‌ వేసవి. ఈ సమ్మర్‌కి అగ్ర హీరోల సినిమాల విడుదల లేదు. దీంతో, ఈవారం కూడా చిన్న చిత్రాలే ప్రేక్షకులకు వినోదం పంచనున్నాయి. ఇప్పటికే థియేటర్లలో సందడి చేసి, ఓటీటీలోకి వచ్చేందుకు కొన్ని సిద్ధమయ్యాయి. అవేంటో చూసేయండి..

రాజు యాదవ్‌గా గెటప్‌ శ్రీను

‘జబర్దస్త్‌’ ఫేమ్‌ గెటప్‌ శ్రీను (Getup Srinu) కథానాయకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘రాజు యాదవ్‌’ (Raju Yadav). అంకిత ఖరత్‌ హీరోయిన్‌. కృష్ణమాచారి కె. దర్శకత్వం వహించారు. కామెడీతోపాటు ఎమోషన్స్‌కూ ప్రాధాన్యత ఉన్న ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.


నవ్వుల రత్నాలు..

రంగస్థలం మహేశ్‌, సుదర్శన్‌, ఇనయ సుల్తానా తదితరులు కీలక పాత్రలు పోషించిన కామెడీ చిత్రం ‘నటరత్నాలు’ (NataRatnalu). నర్రా శివనాగు దర్శకత్వం వహించారు. ఈ నెల 17న మూవీ విడుదల కానుంది.


థ్రిల్‌ పంచేందుకు..

శాంతి, జీకే వికాస్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన సినిమా ‘దర్శిని’ (Darshini). డా. ప్రదీప్‌ అల్లు దర్శకత్వం వహించారు. థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సైన్స్‌ ఫిక్షన్‌ ఫిల్మ్‌ మే 17న ప్రేక్షకుల ముందుకురానుంది.


ఆత్మల కథతో..

హత్యకు గురైన ఇద్దరి వ్యక్తుల ఆత్మలు ఓ గ్రామాన్ని ఏం చేశాయన్న కథాంశంతో కందుర్తి త్రివిక్రమ రావు తెరకెక్కించిన చిత్రం ‘అక్కడవారు ఇక్కడ ఉన్నారు’. సాయిహర్షిణి, యస్వీ రమణ, కేవీ రమణ తదితరులు నటించిన ఈ సినిమా మే 17న విడుదలవుతుంది.

అపరిచితుడు.. మళ్లీ వస్తున్నాడు

టాలీవుడ్‌లో కొంతకాలంగా రీరిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో హిట్‌గా నిలిచిన ఎన్నో చిత్రాలు మళ్లీ వెండితెరపై ప్రదర్శితమై, ప్రేక్షకులకు నాటి జ్ఞాపకాలు గుర్తుచేశాయి. ఇప్పుడు ‘అపరిచితుడు’ (Aparichitudu) రానుంది. విక్రమ్‌ హీరోగా దర్శకుడు శంకర్‌ తెరకెక్కించిన ఈ మూవీ 2005లో విడుదలై ఘన విజయం అందుకుంది. మే 17న మరోసారి కొన్ని థియేటర్లలో మెరవనుంది.


ఓటీటీల్లో ఏయే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రాబోతున్నాయంటే?

రాహుల్‌ విజయ్‌ (Rahul Vijay), శివానీ రాజశేఖర్‌ (Shivani Rajashekar) జంటగా నటించిన చిత్రం ‘విద్యా వాసుల అహం’ (Vidya Vasula Aham). మణికాంత్‌ గెల్లి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నేరుగా ఓటీటీ ‘ఆహా’ (Aha)లో మే 17న రిలీజ్‌ కానుంది.

డిస్నీ+ హాట్‌స్టార్‌

 • ‘బాహుబలి: క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌’ (యానిమేటెడ్‌ సిరీస్‌): మే 17
 • క్రాష్‌ (కొరియన్‌ సినిమా): మే 14 
 • కల్వన్‌ (తెలుగులోనూ): మే 15

జియో సినిమా

 • జర హట్కే జర బచ్కే (తెలుగులోనూ): మే 17

జీ 5

 • బస్తర్‌: మే 17 

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

 • అవుటర్‌ రేంజ్‌ సీజన్‌ 2 (హాలీవుడ్‌ సిరీస్‌): మే 16

నెట్‌ఫ్లిక్స్‌

 • ఆష్లే మ్యాడిసన్‌ (హాలీవుడ్‌ సిరీస్‌): మే 15
 • బ్రిడ్జర్టన్‌ సీజన్‌ 3 (హాలీవుడ్‌ సిరీస్): మే 16
 • మేడమ్‌ వెబ్‌ (హాలీవుడ్‌ సిరీస్‌): మే 16
 • ది 8 షో (కొరియన్‌ సిరీస్‌): మే 17

సోనీలివ్

 • లంపన్‌ (మరాఠీ సిరీస్‌): మే 17

ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌

 • ఎల్లా (హిందీ): మే 17

బుక్‌ మై షో

 • గాడ్జిల్లా x కాంగ్‌: ది న్యూ ఎంపైర్‌ (స్ట్రీమింగ్‌ అవుతోంది.)
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని