Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’.. ఆరోజు ఎంతో కంగారుపడ్డా: మీనాక్షి చౌదరి

‘గుంటూరు కారం’ (Guntur Kaaram) షూటింగ్‌ అనుభవాలను తెలియజేశారు నటి మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary). సినీ ప్రియుల ఎదురుచూపులకు ఈ సినిమా సరైన సమాధానం చెబుతుందన్నారు.

Published : 08 Dec 2023 17:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నటి మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary). ఈ సినిమా కోసం మహేశ్‌బాబు (Mahesh Babu)తో కలిసి వర్క్ చేయడంపై తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహేశ్‌బాబు రియల్‌ లైఫ్‌లోనూ సూపర్‌స్టారేనని ఆమె అన్నారు. ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

‘‘మహేశ్‌బాబు ఎంతో ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనొక ఫ్యామిలీ పర్సన్‌. ప్రతి ఒక్కరినీ గౌరవిస్తుంటారు. స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తుంటారు. సెట్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నేనెంతో టెన్షన్‌ పడ్డా. ఫస్ట్‌ డే ఫస్ట్‌ షాట్‌లోనే ఆయనతో కలిసి వర్క్ చేశా. అప్పుడు నేను ఎంతో కంగారుపడ్డా. ‘కంగారుపడొద్దు. కాస్త సమయం తీసుకో. ఏం కాదు’ అంటూ ఆయన సపోర్ట్‌ చేశారు. ఆయనతో వర్క్‌ చేయడం ఎంతో సరదాగా అనిపించింది. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. అభిమానులందరూ ఆయన సినిమా కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు. వాళ్ల ఎదురుచూపులకు ఇది సరైన సమాధానం ఇస్తుంది’’ అని ఆమె చెప్పారు.

The Archies Review: రివ్యూ: ది ఆర్చిస్‌.. బాలీవుడ్‌ వారసుల మూవీ ఎలా ఉంది?

‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రమిది. శ్రీలీల కథానాయిక. మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి నెలలో ఇది విడుదల కానుంది. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. ఇక, ఈ సినిమాలో మొదట పూజాహెగ్డేను కథానాయికగా ఎంచుకున్న విషయం తెలిసిందే. అనివార్య కారణాలతో ఆమె ఈ సినిమా నుంచి వైదొలగారు. దాంతో, మీనాక్షి ఈ సినిమాలో భాగమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని