Pratinidhi 2 Teaser: ప్రతినిధి పిలుపు
‘‘ఇప్పటికైనా కళ్లు తెరవండి. ఒళ్లు విరిచి బయటకొచ్చి ఓటేయండి...’’ అంటూ ఓటర్లకు పిలుపునిచ్చాడు బాధ్యత కలిగిన ఓ జర్నలిస్ట్.
‘‘ఇప్పటికైనా కళ్లు తెరవండి. ఒళ్లు విరిచి బయటకొచ్చి ఓటేయండి...’’ అంటూ ఓటర్లకు పిలుపునిచ్చాడు బాధ్యత కలిగిన ఓ జర్నలిస్ట్. ప్రజల గొంతుకగా మారి నాయకుల్ని ప్రశ్నించడంతోపాటు, వాళ్ల నుంచి ఎదురైన ఎన్నో సవాళ్లకు ఎదురొడ్డి నిలిచిన ఆ జర్నలిస్ట్ కథేమిటో తెలియాలంటే ‘ప్రతినిధి 2’ చూడాల్సిందే. నారా రోహిత్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సిరీ లెల్ల, దినేశ్ తేజ్, సప్తగిరి, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషించారు. జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించారు. కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మాతలు. ‘ప్రతినిధి’కి కొనసాగింపుగా రూపొందిన ఈ సినిమా టీజర్‌ని శుక్రవారం అగ్ర కథానాయకుడు చిరంజీవి విడుదల చేశారు. ‘‘కథానాయకుడు నారా రోహిత్ మరోసారి బలమైన పాత్రలో, గాఢమైన నటనతో కట్టిపడేస్తారు. దర్శకుడు మూర్తి దేవగుప్తపు తన రచన, దర్శకత్వంతో ఆకట్టుకుంటారు. ఏప్రిల్ నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయభాను, శ్రీ, అజయ్ ఘోష్, అజయ్, ప్రవీణ్, పృథ్వీరాజ్, రఘుబాబు, రఘు కారుమంచి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, కళ: కిరణ్ కుమార్ మన్నె.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TS Loksabha Polling: సినీ ప్రముఖులు.. ఓటేసి.. స్ఫూర్తి నింపి!
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. పలువురు సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
-
గత ఎన్నికల్లో మౌనవ్రతం అని చెప్పానేమో..!: చిరంజీవి ఫన్నీ కామెంట్స్
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. -
నీ ఓటు ఎటువైపు పోవాలో నీ చేతుల్లోనే ఉంది.. ఓటు విలువ చెప్పిన హీరోలు
పలు సినిమాల్లోనూ ఓటు హక్కు ప్రయోజనాన్ని తెలియజేస్తూ వచ్చిన సన్నివేశాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అవుతున్నాయి. -
నంద్యాల పర్యటనపై క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్
ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే నంద్యాల వెళ్లానని సినీ నటుడు అల్లు అర్జున్ తెలిపారు. -
టాలీవుడ్లో... పీరియాడిక్ కథల జోరు
కొత్తదనం పంచే క్రమంలో కాలాన్ని వెనక్కి తిప్పుతున్నారు మన కథానాయకులు. కథలతో పాటుగా ప్రేక్షకుల్ని టైమ్ మిషన్ ఎక్కించి.. గత కాలానికి తీసుకెళ్లి వినోదాల విందు వడ్డించే ప్రయత్నం చేస్తున్నారు. -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయం
యావత్తు సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చిత్రోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
సెంచరీ కొడతాననుకున్నా
‘హీరామండీ: ది డైమండ్ బజార్’ నాయిక రిచా చద్ధా రికార్డు కొట్టింది. -
అవకాశం వస్తే వదులుకోను
సినీ తారల్లో ఇదివరకు చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చెప్పేవాళ్లు. -
మాతృమూర్తి.. ఆనందం
ప్రేమ.. ఆప్యాయత.. అనురాగం.. త్యాగం.. ఇలాంటి మాటలకు ప్రతిరూపం అమ్మ. -
పల్లెటూరి.. ‘వీర ధీర శూరన్’
విలక్షణ నటుడు విక్రమ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘వీర ధీర శూరన్’. -
సిక్సర్ కొట్టిన ప్రేమ!
ఒకే కల.. దాన్ని నెరవేర్చుకోవడం కోసం ఆరాటపడుతున్న రెండు యువహృదయాలు. -
క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్‌లో అక్కినేని హీరోలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విశేషాలివీ.. -
నాకు తప్ప వారందరికీ వివాహమైంది: సోనాక్షి సిన్హా
తాను పాల్గొన్న ఓ కార్యక్రమంలో పెళ్లి ప్రస్తావన రాగా సోనాక్షి సిన్హా స్పందించారు. -
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
తన ఫ్యాషన్ గురించి ఓ నెటిజన్ జాన్వీని ప్రశ్నించగా ఆమె స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీ.. విశాఖ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు
-
స్వాతీమాలీవాల్‌పై దాడి..! దిల్లీ సీఎం నివాసం బాక్సింగ్ రింగ్‌లా మారిందన్న భాజపా
-
‘దుమ్మురేపిన’ గాలివాన.. ముంబయిలో మెట్రో, సబ్అర్బన్ సర్వీసులకు అంతరాయం
-
రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసు.. 3 స్థానాల కోసం ఐదు జట్ల పోటీ
-
ఏనుగులకు అనారోగ్యం.. 3500కి.మీ వెళ్లి కాపాడిన ‘అంబానీ’ బృందం
-
‘ప్రజ్వల్ మా అమ్మపై అత్యాచారం చేశాడు.. బలవంతంగా నా దుస్తులు విప్పించాడు’