Monkey man: ‘మంకీ మ్యాన్‌’ రాక ఆలస్యం?

‘చిన్న నిప్పుకణికే సమయమొస్తే.. అగ్గి రాజేసి ఎంతటి దాన్నైనా బుగ్గి చేసేస్తుంది’ అంటూ ట్రైలర్‌తో ఆసక్తి రేకెత్తించాడు ‘మంకీమ్యాన్‌’. ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ ఫేం దేవ్‌పటేల్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రమిది.

Updated : 01 Apr 2024 12:06 IST

‘చిన్న నిప్పుకణికే సమయమొస్తే.. అగ్గి రాజేసి ఎంతటి దాన్నైనా బుగ్గి చేసేస్తుంది’ అంటూ ట్రైలర్‌తో ఆసక్తి రేకెత్తించాడు ‘మంకీమ్యాన్‌’. ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ ఫేం దేవ్‌పటేల్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రమిది. శోభిత ధూళిపాళ కథానాయిక. ఏప్రిల్‌ 19న రాబోతున్నట్లు గతంలో ప్రకటించినా.. నిర్మాణానంతర కార్యక్రమాల్లో జాప్యం కారణంగా కాస్త ఆలస్యంగా ఏప్రిల్‌ 26న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు ఆదివారం సన్నిహితవర్గాలు తెలిపాయి. పురాణ పురుషుడు హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకున్న హీరో.. బలహీనుల్ని దోచుకునే బలవంతుల ఆట కట్టించేందుకు ఏం చేశాడనే కథాంశంతో దీన్ని రూపొందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు