imdb most anticipated movies: టాప్‌లో ప్రభాస్‌ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట

Imdb top movies: ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ ఆసక్తికర మూవీల జాబితాను విడుదల చేసింది.

Published : 27 Apr 2024 19:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గత నెల రోజులుగా బాక్సాఫీస్‌ వద్ద వరుస సినిమాలు విడుదలవుతున్నా, అంతగా సందడి కనిపించడం లేదు. ఒకవైపు ఎన్నికలు, మరోవైపు ఐపీఎల్‌కు తోడు ఎండలు మండిపోతుండటంతో థియేటర్‌కు వెళ్లే వారి సంఖ్య కాస్త తగ్గింది. ఈక్రమంలో త్వరలో విడుదల కాబోయే కొన్ని సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూవీలకు సంబంధించి రేటింగ్స్‌ ఇచ్చే  ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ (IMDb) అత్యధికమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల జాబితాను ప్రకటించింది. ఇందులో ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) టాప్‌లో నిలిచింది. నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో దీపిక పదుకొణె, అమితాబ్‌, కమల్‌హాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

దీని తర్వాత సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన వెబ్‌సిరీస్‌ ‘హీరా మండి: ది డైమండ్‌ బజార్‌’ (Heeramandi) నిలిచింది. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరి, రిచా చద్దా, సంజీదాషేక్‌, షర్మిన్‌ సెగల్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మే 1వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సిరీస్‌పై అంచనాలు పెంచుతున్నాయి. ఇక టాప్‌-3లో తమిళ కామెడీ హారర్‌ థిల్లర్‌ ‘అరణ్మణై4’ (Aranmanai 4) ఉండటం గమనార్హం. సుందర్‌. సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తమన్నా, రాశీఖన్నా నటిస్తున్నారు. తెలుగులో ‘బాక్‌’ పేరుతో మే 3న ప్రేక్షకుల ముందుకురానుంది.

  • ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న టాప్‌-10 చిత్రాలు
  • కల్కి 2898 ఏడీ
  • హీరా మండి: ది డైమండ్‌ బజార్‌
  • అరణ్మణై 4
  • శ్రీకాంత్‌
  • తంగలాన్‌
  • నడిగర్‌
  • మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహీ
  • టర్బో
  • గురువయ్యూర్‌ అంబల నాయిదల్‌
  • మలయాళీ ఫ్రమ్‌ ఇండియా
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని