Ajith: అజిత్‌ రియల్‌ స్టంట్‌.. హ్యాట్సాఫ్‌ అంటోన్న నెటిజన్లు

తన సినిమా కోసం అజిత్ రిస్క్‌ చేసి యాక్షన్‌ సీక్వెన్స్‌లో నటించారు. దీనికి సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ షేర్‌ చేసింది.

Updated : 04 Apr 2024 15:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళ స్టార్‌ అజిత్‌కు (Ajith Kumar) స్టంట్స్‌ అంటే చాలా ఇష్టం. సినిమాల్లోనూ రైడింగ్‌ సన్నివేశాలను ఆయన డూప్‌ లేకుండా నటిస్తారని ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించారు. ఆయన స్వయంగా ఇలాంటి సీన్‌ చేసి రిస్క్‌ తీసుకున్న ఓ వీడియోను తాజాగా నిర్మాణ సంస్థ పోస్ట్‌ చేసింది. 

ప్రస్తుతం అజిత్‌ తన 62వ చిత్రం ‘విదా ముయార్చి’లో నటిస్తున్నారు. గతేడాది నవంబర్‌లో ఇందులోని యాక్షన్‌ సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించారు. ఆ యాక్షన్‌ సీక్వెన్స్‌లో అజిత్ డూప్‌ లేకుండా నటించడంతో ఆయనకు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను లైకా ప్రొడక్షన్స్‌ షేర్‌ చేసింది. సన్నివేశంలో భాగంగా తన పక్కన ఉండే వ్యక్తిని కాపాడేందుకు అజిత్‌ ఫాస్ట్‌గా కారు డ్రైవ్‌ చేయాలి. డూప్‌ లేకుండా తానే స్వయంగా వెహికల్ నడిపారు. దీంతో ఒక్కసారిగా కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదం నుంచి ఆయన చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. ఈ వీడియోను షేర్‌ చేసిన నిర్మాణ సంస్థ ‘ ధైర్యానికి హద్దులు ఉండవని నిరూపించిన హీరో..’ అంటూ అజిత్‌పై ప్రశంసలు కురిపించింది. ఇది చూసిన నెటిజన్లు సినిమాలపై ఆయనకు ఉన్న నిబద్ధత చూసి ఆశ్చర్యపోతున్నారు. ‘హ్యాట్సాఫ్’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. మాగిజ్‌ తిరుమేని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అజిత్‌ సరసన త్రిష నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని