Mrunal Thakur: త్వరలోనే పెళ్లి చేసుకుంటా: మృణాల్ ఠాకూర్‌

తాను త్వరలోనే పెళ్లి చేసుకుంటానని నటి మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) తెలిపారు. న్యూజెర్సీలో ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna) థియేటర్‌ విజిట్‌లో పాల్గొన్న ఆమె ఈ విషయాన్ని చెప్పారు.

Published : 08 Dec 2023 02:16 IST

హైదరాబాద్‌: ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna)తో య‌ష్నగా ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur). నాని (Nani) హీరోగా నటించిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తండ్రీ కుమార్తెల కథతో తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్‌ నటన తమకెంతో నచ్చిందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. యష్న పాత్ర తమ మనసుకు చేరువైందంటున్నారు.

‘భామాకలాపం 2’ ప్రీమియర్‌.. వాళ్లకు మాత్రమే అవకాశం..!

ఇదిలా ఉండగా.. తన తదుపరి సినిమా ‘ఫ్యామిలీ స్టార్‌’ షూట్‌లో భాగంగా మృణాల్‌ ప్రస్తుతం న్యూజెర్సీలో ఉన్నారు. ‘హాయ్‌ నాన్న’కు వస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ప్రేక్షకులతో కాసేపు మాట్లాడేందుకు అక్కడి థియేటర్‌కు వెళ్లారు. ‘‘హాయ్‌ నాన్న’ నాకెంతో ప్రత్యేకమైన చిత్రం. నాని ప్రస్తుతం ఇండియాలో ఉన్నారు. రేపు ఆయన ఇక్కడికి రావొచ్చు. ‘ఫ్యామిలీ స్టార్‌’ షూట్‌లో భాగంగా నేను ఇక్కడికి వచ్చాను. నాని వచ్చిన తర్వాత మరోసారి (న్యూజెర్సీ సినీ లవర్స్‌ను ఉద్దేశించి) మీ అందరినీ కలిసేందుకు వస్తా. ‘సమయమా’.. ‘అమ్మాడీ’ నాకెంతో ఇష్టమైన పాటలు. ‘సీతారామం’ నుంచి న్యూజెర్సీ నాపై ఎంతో ప్రేమను కురిపిస్తోంది. ‘సీతారామం’ సమయంలోనూ నేను ఇక్కడికి వచ్చా. ‘హాయ్‌ నాన్న’తో ఇక్కడి ప్రేక్షకులను కలవడం అదృష్టంగా భావిస్తున్నా’’ అని ఆమె అన్నారు. ఇంతలో అక్కడే ఉన్న ఓ పిల్లాడు.. ‘‘మీకు పెళ్లైందా?’’ అని ప్రశ్నించాడు. ఆ మాటలకు నవ్వులు పూయించిన ఆమె ‘‘త్వరలోనే.. త్వరలోనే.. పెళ్లి చేసుకుంటా’’ అని బదులిచ్చారు.

‘హాయ్‌ నాన్న’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌:

ఈ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకగా జరిగాయి. నాని, బేబీ కియారా, ఇతర చిత్రబృందం పాల్గొని బెలూన్స్‌ ఎగురవేసి తమ ఆనందాన్ని తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫొటోని షేర్‌ చేసిన నాని.. ‘‘సినిమా.. మీ ప్రేమను సెలబ్రేట్‌ చేసుకుంటున్నాం’’ అని పోస్ట్ పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని