Mrunal Thakur: భారీ ప్రాజెక్ట్‌ చేజారిపోయింది.. ఆ విషయం నన్నెంతో భయపెడుతుంది: మృణాల్‌

సెలబ్రిటీలుగా ఉండటం వల్ల వచ్చే లాభనష్టాల గురించి స్పందించారు నటి మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur).

Updated : 30 Mar 2024 12:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సెలబ్రిటీలుగా ఉండటం వల్ల వచ్చే లాభనష్టాలపై స్పందించారు నటి మృణాల్‌ ఠాకూర్ (Mrunal Thakur). ‘‘సెలబ్రిటీగా ఉంటే ఈ ప్రపంచం నిన్ను ప్రేమిస్తుంది. నీ వర్క్‌తో సమాజంలో మార్పు తీసుకురావచ్చు. ఇబ్బందుల గురించి చెప్పాలంటే.. వర్క్‌లో భాగంగా కుటుంబానికి దూరంగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు కుటుంబసభ్యుల పక్కన ఉండలేం. కొన్నిసార్లు నాక్కూడా ఒక సాధారణ జీవితాన్ని గడపాలనిపిస్తుంది. ఇరవైల్లోనే పెళ్లి చేసుకుని, పిల్లలను కని, డిన్నర్‌ కోసం రెస్టారంట్‌కు వెళ్లి రావొచ్చు’’ అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మృణాల్‌ చెప్పారు. మరణం గురించి ఆలోచిస్తే భయంగా ఉంటుందని.. తను చనిపోతే కుటుంబం ఏమైపోతుందా? అని ఎక్కువగా ఆలోచిస్తుంటానని చెప్పారు.

‘హాయ్‌ నాన్న’ తర్వాత మృణాల్‌ ఠాకూర్‌ నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. విజయ్‌ దేవరకొండ హీరోగా పరశురామ్‌ దీనిని తెరకెక్కించారు. దిల్‌రాజు నిర్మాత. ఇందులో మృణాల్.. ఇందుగా కనిపించనున్నారు. నటిగా కెరీర్‌ ఆరంభించిన సమయంలో భారీ ప్రాజెక్ట్‌లో తనకు అవకాశం వచ్చిందని.. ట్రైనింగ్‌ కూడా ఇప్పించారని చెప్పారు. అనివార్య కారణాల వల్ల అది చేజారిపోయిందన్నారు. ఆ ట్రైనింగ్‌ వల్లే తనకు ‘లవ్‌ సోనియా’లో అవకాశం వచ్చిందని కాబట్టి ఫెయిల్యూర్స్ కూడా కొన్నిసార్లు మంచికే జరుగుతాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని