Mrunal Thakur: భన్సాలీ నిర్మాణంలో మృణాల్‌ చిత్రం!

‘సీతారామం’, ‘హాయ్‌ నాన్న’ విజయాలతో జోరు చూపించింది మృణాల్‌ ఠాకూర్‌. కానీ, ఇటీవల ఆమె నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ ఆశించిన ఫలితాన్ని అందించలేదు. దీని తర్వాత ఆమె నుంచి మళ్లీ కొత్త కబురు వినిపించలేదు.

Updated : 22 May 2024 09:32 IST

‘సీతారామం’, ‘హాయ్‌ నాన్న’ విజయాలతో జోరు చూపించింది మృణాల్‌ ఠాకూర్‌. కానీ, ఇటీవల ఆమె నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ ఆశించిన ఫలితాన్ని అందించలేదు. దీని తర్వాత ఆమె నుంచి మళ్లీ కొత్త కబురు వినిపించలేదు. అయితే ప్రస్తుతం ఆమె హిందీలో సంజయ్‌ లీలా భన్సాలీ నిర్మాణంలో ఓ చిత్రం చేయనున్నట్లు సమాచారం. ‘మామ్‌’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించిన రవి ఉద్యావర్‌ దీనికి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. సిద్ధాంత్‌ చతుర్వేది కథానాయకుడిగా కనిపించనున్నారు. ఇదొక భిన్నమైన రొమాంటిక్‌ డ్రామా కథతో తెరకెక్కనుందని.. దీంట్లో సంగీతానికి ఎంతో ప్రాధాన్యముందని తెలుస్తోంది. అంతేకాదు దీనికి భన్సాలీ స్వయంగా సంగీతమందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా జూన్‌ నుంచి చిత్రీకరణని ప్రారంభించు కోనున్నట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని