Indian 2: గ్రాండ్‌గా ‘భారతీయుడు 2’ ఆడియో లాంచ్‌.. వైరలవుతోన్న సెలబ్రిటీల లిస్ట్!

‘భారతీయుడు 2’ ఆడియో లాంచ్‌ ఈవెంట్‌కు సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఈవెంట్‌కు అగ్ర నటీనటులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Published : 24 May 2024 15:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కమల్‌ హాసన్‌ (Kamal Haasan) హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భారతీయుడు 2’ (Indian 2). ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌ ఘనంగా జరగనుందని టాక్ వినిపిస్తోంది. ఆ ఈవెంట్‌కు హాజరుకానున్న అతిథుల లిస్ట్‌ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

మూవీ టీమ్‌ ఈ ఈవెంట్‌ను జూన్‌ 1న ప్లాన్‌ చేసిన సంగతి తెలిసిందే. చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ఘనంగా దీన్ని నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు అన్ని భాషలకు చెందిన స్టార్‌ హీరోలను ఆహ్వానించనున్నట్లు టాక్‌. బాలీవుడ్‌ నుంచి రణవీర్‌సింగ్‌, టాలీవుడ్‌ నుంచి చిరంజీవి, రామ్‌చరణ్‌, మలయాళ పరిశ్రమ నుంచి మోహన్‌లాల్‌ ఈ వేడుకకు హాజరుకానున్నారట. వీళ్లతోపాటు స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నం కూడా ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభించారని.. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.

30 ఏళ్ల తర్వాత కేన్స్‌లో భారతీయ చిత్రం.. రెడ్‌ కార్పెట్‌పై మనోళ్ల డ్యాన్స్‌

1996లో కమల్‌హాసన్, శంకర్‌ కలయికలో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ‘భారతీయుడు’కి కొనసాగింపుగా రూపొందిన చిత్రమిది. జులై 12న తెలుగు, తమిళంతోపాటు హిందీ భాషలో ప్రేక్షకుల ముందుకుతీసుకురానున్నారు. తాజాగా ఈ సినిమాలోని ‘‘శిరసెత్తే శిఖరం నువ్వే...’’ పాటను విడుదల చేయగా అది మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. మరోవైపు దీని మూడో పార్ట్‌ కూడా షూటింగ్‌ పూర్తయింది. రెండో భాగం విడుదలైన ఏడాదిలోపే పార్ట్‌3 కూడా రిలీజ్‌ చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని