‘నా ఉచ్ఛ్వాసం కవనం’..

తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవాన్ని తీసుకువచ్చి, సరికొత్త పోకడ సృష్టించిన గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి.

Published : 19 May 2024 00:44 IST

ఈటీవీలో సరికొత్త సంగీత వ్యాఖ్యాన కార్యక్రమం..
ప్రతి ఆదివారం ఉదయం 9గం.30నిలకు  

తెలుగు సినిమా పాటకు కావ్య గౌరవాన్ని తీసుకువచ్చి, సరికొత్త పోకడ సృష్టించిన గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. సోమవారం ఆయన జయంతిని పురస్కరించుకొని సిరివెన్నెల సాహిత్యాన్ని భావితరాలకు అందించే కృషిలో భాగంగా.. ‘నా ఉచ్ఛ్వాసం కవనం..!’ అనే సంగీత వ్యాఖ్యాన కార్యక్రమం మొదటి సంచిక ఈ రోజు ఉదయం 9గం.30ని.లకు ఈటీవీలో ప్రసారం కాబోతుంది. ఈటీవీ సౌజన్యంతో ‘శ్రుతి లయ ఫౌండేషన్‌ అమెరికా’, ‘కీర్తన అకాడెమీ ఆఫ్‌ మ్యూజిక్‌’ సంయుక్త సమర్పణలో రామ్‌ చెరువు నిర్మాణ సారథ్యంలో ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు పార్థు నేమాని వ్యాఖ్యాతగా రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమం భారతదేశంలోనూ, అదే సమయంలో అమెరికాలోనూ 52 ఆదివారాల పాటు ఈటీవీలో ప్రసారమవుతుంది. ఇందులో నాగార్జున, ప్రభాస్, తనికెళ్ల భరణి, మణిరత్నం, రాజమౌళి, కృష్ణ వంశీ, క్రిష్‌ జాగర్లమూడి, రామజోగయ్య శాస్త్రి, ఆర్పీ పట్నాయక్‌ లాంటి సినీ ప్రముఖులు పాల్గొంటారు. ప్రసారానంతరం ఈ ఎపిసోడ్లు ఈటీవీ యూట్యూబ్‌ ఛానెల్‌లో అందుబాటులో ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని