Kalki: ‘కల్కి 2898 ఏడీ’ టైటిల్‌ అందుకే పెట్టాం.. అసలు విషయం చెప్పిన నాగ్‌ అశ్విన్‌

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. దీని టైటిల్‌ వెనుక ఉన్న కారణాన్ని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ పంచుకున్నారు.

Updated : 26 Feb 2024 11:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా ఇది రానుంది. దీని టైటిల్‌ను ప్రకటించినప్పటి నుంచి ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీ ప్రియుల్లోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర దర్శకుడు ఆ టైటిల్‌ పెట్టడానికి గల కారణాన్ని వెల్లడించారు.

‘ఈ చిత్రం కథ మహాభారతం కాలం నుంచి మొదలై 2898తో పూర్తవుతుంది. గతంతో ప్రారంభమై భవిష్యత్తుతో ముగుస్తుంది కాబట్టి ఈ టైటిల్ పెట్టాం. దీనిలో మొత్తం 6,000 సంవత్సరాల మధ్య జరిగే కథను చూపించనున్నాం. నాటి రోజులకు తగినట్లు ఓ ప్రపంచాన్ని సృష్టించాం. అన్నిట్లో భారతీయత కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. గతంలో హాలీవుడ్‌లో విడుదలైన సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘బ్లేడ్‌ రన్నర్‌’ పోలికలు దీనిలో కనిపించనీయలేదు. ఇది మాకు సవాలు’ అని చెప్పారు. ఈ అప్‌డేట్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి.

ఈ వారం థియేటర్‌ / ఓటీటీ చిత్రాలివే!

ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకొణె (Deepika Padukone) నటిస్తోన్న ఈ చిత్రంలో దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), కమల్‌ హాసన్‌ (Kamal Haasan) కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ‘జస్ట్‌ ది వార్మ్‌ అప్‌’ అనే క్యాప్షన్‌తో విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని