Dhootha: ‘దూత’లోఎక్కువ సన్నివేశాలు వర్షంలోనే చిత్రీకరించారు: నాగచైతన్య

నాగచైతన్య తొలి వెబ్‌ సిరీస్‌ దూత (Dhootha) డిసెంబర్‌ 1 నుంచి ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో టీమ్‌ ప్రమోషన్‌ జోరు పెంచింది.

Updated : 27 Nov 2023 15:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘దూత’ (Dhootha) వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు నాగ చైతన్య (Naga Chaitanya). ఆయన నటిస్తోన్న తొలి సిరీస్‌ కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విక్రమ్ కె కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నేచురల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ డిసెంబర్ 1న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో నాగచైతన్య ప్రమోషన్స్‌ షురూ చేశారు. ఈ సిరీస్‌ విశేషాలను పంచుకున్నారు.

‘‘దూత’ అంటే మెసేంజర్‌. ఇందులో నేను జర్నలిస్ట్‌ సాగర్‌ పాత్రలో నటించాను. ఈ సిరీస్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇది 8 ఎపిసోడ్‌లలో అలరించనుంది. ఇందులో ఎక్కువ సన్నివేశాలు వర్షంలోనే చిత్రీకరించారు’ అని చెప్పారు. ఇక గోవాలో జరుగుతోన్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్ ఆఫ్‌ ఇండియా (IFFI) వేడుకల్లో దీని మొదటి ఎపిసోడ్‌ను ప్రదర్శించగా మంచి స్పందన వచ్చింది. ఈ వేడుకలకు నాగచైతన్య, విక్రమ్ కె కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగచైతన్య మీడియాతో మాట్లాడుతూ.. మంచి కథలు ఉంటే ఓటీటీలోనూ వరుస సిరీస్‌లు నటించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వెబ్‌ సిరీస్‌లు చేయాలని నిర్ణయించుకోగానే విక్రమ్‌ తనకు ‘దూత’ కథ చెప్పారన్నారు.

డిసెంబరు ఫస్ట్‌ వీక్‌.. అటు థియేటర్‌, ఇటు ఓటీటీ వేరే లెవల్‌!

ఈ సిరీస్‌ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన దీని పోస్టర్లు, ట్రైలర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఇందులో ప్రియా భవానీ శంకర్‌, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని