Naga Chaitanya: ఆ సినిమా ఫ్లాప్‌ అవుతుందని ముందే తెలిసినా.. నటించేవాడిని: నాగ చైతన్య

నాగచైతన్య (Naga Chaitanya) తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడారు. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ఫ్లాప్ అయినందుకు బాధపడడం లేదన్నారు.

Updated : 05 Dec 2023 20:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాజాగా ‘దూత’(Dhootha) వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టి విజయాన్ని అందుకున్నారు నాగచైతన్య (Naga Chaitanya). డిసెంబర్‌ 1న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ నేచురల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నాగచైతన్య తన తర్వాత సినిమాకు సంబంధించిన పనులు మొదలుపెట్టారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాలో మాట్లాడుతూ తన తొలి బాలీవుడ్‌ చిత్రం ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ఫ్లాప్ కావడంపై స్పందించారు. ఆ సినిమా ప్రేక్షకాదరణ పొందనందుకు బాధపడడం లేదన్నారు.

‘‘దూత’లో నా పాత్రకు జరగబోయేవన్నీ ముందే తెలుస్తాయి. అలాగే ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ ఫ్లాప్ అవుతుందని నాకు ముందే తెలిసినా.. నేను ఆ సినిమాలో కచ్చితంగా నటించేవాడిని. ఎందుకంటే ఆ సినిమాలో నేను ఆమిర్‌ఖాన్‌తో కలిసి నటిస్తాను కాబట్టి ఫలితాన్ని ఆశించకుండా అంగీకరించేవాడిని. ఆయనతో నటించి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అందుకే దాని ఫలితం నన్ను బాధించలేదు. ఆ చిత్రంలో నటించినందుకు ఇప్పటికీ ఆనందంగా ఉన్నాను. అయినా జీవితంలో చాలా ఒడుదొడుకులు ఉంటాయి. అలాగే సినిమాల విషయంలోనూ హిట్, ఫ్లాప్‌ సహజం. వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగాలి’’ అని చెప్పారు.

తుపాను ఎఫెక్ట్‌.. సాయం కోరిన హీరో.. స్పందించిన రెస్క్యూ విభాగం

ఇక ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్‌’లో నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయిక. మత్స్యకారుల జీవితం నేపథ్యంలో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. త్వరలోనే దీని చిత్రీకరణ ప్రారంభం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని